
బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్న ప్రేరణ గురించి ఆసక్తికర విషయం బయటపడింది. పెళ్లైన ఎనిమిది నెలలకే ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఆమె భర్త మొదట ఈ అవకాశాన్ని వద్దన్నాడని ఆమె వెల్లడించింది.
Key Points
ప్రేరణ బిగ్ బాస్ 8లో పాల్గొంది.
ఆమె భర్త మొదట బిగ్ బాస్ కి వెళ్ళొద్దు అన్నాడు.
పెళ్లి అయిన 8 నెలలకే ఈ అవకాశం వచ్చింది.
చివరికి భర్త సపోర్ట్ తో బిగ్ బాస్ ప్రయాణం పూర్తి చేసింది.
ప్రేరణ బిగ్ బాస్ ప్రయాణం
Prerana : బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని సీరియల్ నటి ప్రేరణ మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రేరణ బిగ్ బాస్ లోకి వెళ్లేముందే పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త మొదట బిగ్ బాస్ కి వద్దన్నాడు అని చెప్తూ ఆసక్తికర విషయం బయట పెట్టింది.
ప్రేరణ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిన 8 నెలలకే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. ఒకవేళ చివరి వరకు ఆడినా మూడు నాలుగు నెలలు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని మా ఆయన బాధ పడ్డారు. బిగ్ బాస్ కి వెళ్లొద్దు అన్నారు. పెళ్లయ్యాక మొదటిసారి వచ్చే మా బర్త్ డేలు, మా పెళ్లి డే, ఫస్ట్ పండగలు అన్ని వదిలేసుకోవాలి అని బాధపడ్డారు. కానీ ఇప్పుడు వచ్చింది చేసేద్దాం అని నేను అనుకున్నా. ఇప్పుడు ఛాన్స్ వదిలేస్తే మళ్ళీ వస్తుందో రాదో అని నా భయం. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అని, వద్దని మా ఆయన గొడవ పడ్డాం. మూడు నాలుగు రోజులు నాతో ఆయన మాట్లాడలేదు కూడా.
భర్త ప్రతిస్పందన
చివరి నిర్ణయం
నేనేమో ఒప్పేసుకున్నా ఆల్రెడీ. వద్దంటే ప్రొఫెషనల్ గా పేరు పోతుంది. చాలా స్ట్రాంగ్ గా వెళ్లాల్సిన సమయంలో ఆయన వద్దు అని మాట్లాడటం మానేయడంతో నేను కూడా బాధపడ్డా. కానీ బిగ్ బాస్ కి వెళ్లే ఒక రెండు రోజుల ముందు నైట్ కూర్చొని ఆయనతో మాట్లాడి ఒప్పించా. ఆ తెల్లారి నుంచి నాతో మళ్ళీ మాములుగా మాట్లాడారు. నేను బిగ్ బాస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఆయనే బయట ఉండి సపోర్ట్ చేసారు అని తెలిపింది.
చివరకు ప్రేరణ తన భర్త మద్దతుతో బిగ్ బాస్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అనుభవం ఆమె జీవితంలో మరపురానిది అని చెప్పవచ్చు.


