|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కేటీఆర్ పేరుతో యావర్కు బెదిరింపులు! ఆత్మహత్య చేసుకుంటానన్న బిగ్ బాస్ ప్రిన్స్!!

Published: 01-02-2026, 8:35 AM
  • బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ తనను మోసం చేశారని ఆరోపించారు.
  • తన బంధువులు కేటీఆర్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • 30 లక్షల రూపాయల విషయంలో మోసం జరిగిందని యావర్ తెలిపారు.
  • ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని యావర్ వెల్లడించారు.

బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ తాజాగా తనను మోసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తన బంధువులే కేటీఆర్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీని కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు కూడా వచ్చానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రిన్స్ యావర్ సంచలన ఆరోపణలు

Prince Yawar: ప్రిన్స్ యావర్ పరిచయం అవసరం లేని పేరు . బిగ్ బాస్ 7 రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితమైన యావర్ హౌస్ నుంచి మొదట్లోనే బయటకు వస్తారని అందరూ భావించారు కానీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ ఫిజికల్ టాస్కులలో అద్భుతమైన ఆట తీరును కనబరిస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యావర్ ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేశారు అయితే ప్రస్తుతం ఈయన యూట్యూబ్ కవర్ సాంగ్స్ అలాగే సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న యావర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలనమైన వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా తాను మోసపోయానని కేటీఆర్ పేరు చెప్పి తనని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. ఒక ల్యాండ్ విషయంలో తన సమీప బంధువులు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఈయన తెలిపారు. దాదాపు 30 లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని ఎమోషనల్ అయ్యారు. నా ఫ్యామిలీతో మాట్లాడి 23 లక్షలు ఇస్తానని తనని ఒప్పించారని ఆ డబ్బును కేవలం 15 రోజులలోనే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు

కేటీఆర్ పేరుతో బెదిరింపులు!

ఆ డబ్బు గురించి అడుగుతుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫ్రెండ్స్ కాల్ చేస్తే నన్ను బెదిరిస్తున్నారు పెద్దపెద్ద వాళ్ల పేర్లు చెప్పి నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రిన్స్ యావర్ తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉపయోగిస్తున్నారని అందులో కేటీఆర్(KTR) సార్ పేరు కూడా వాడుతున్నారని ఈయన తెలిపారు. ఈ వీడియో కచ్చితంగా కేటీఆర్ సార్ వరకు వెళుతుందని నేను భావిస్తున్నాను.

?igsh=MWF5ZG4yMWsxbXl0NQ%3D%3D

ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన యావర్

ఈ విధమైనటువంటి విషయాలను ఆయన ఎప్పుడు ప్రోత్సహించరని, ఆయన వెనుక చాలా జరుగుతుంది ఈ విషయాలు ఆయనకు తెలియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో నన్ను మోసం చేసిన వ్యక్తితో పాటు ఆయన ఫోన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఈ విషయం కారణంగా తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించానని తెలిపారు కానీ నాకు కొంతమంది అభిమానులు ఉన్నారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నానని, నాలాగా మరెవరు మోసపోవద్దు అంటూ యావర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా కేటీఆర్ పేరుతో తనని మోసం చేశారంటూ ఈయన చెప్పడంతో ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ప్రిన్స్ యావర్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రాజకీయ వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.