
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘ఖలీఫా’ నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వైశాఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రివెంజ్ థ్రిల్లర్ సినిమా 2026 ఓనమ్‌కు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Key Points
పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా 'ఖలీఫా' పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల.
దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న ఈ రివెంజ్ థ్రిల్లర్ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది.
విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం 2026 ఓనమ్ పండుగ సందర్భంగా విడుదల కానుంది.
ఖలీఫా: రివెంజ్ థ్రిల్లర్ వివరాలు
మలయాళ నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran) నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మలయాళ కొత్త సినిమా ‘ఖలీఫా'(Khalifa) నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న రివెంజ్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 15ఏళ్ల తర్వాత ‘పోక్కిరి రాజా’ (2010) మళ్లీ వారిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు.
అమీర్ అలీగా ఆయన ఈ సినిమాలో కనిపిచనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఇందులో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి, ప్రియంవద కృష్ణన్ నటించనున్నారు. 2026 ఓనమ్ పండుగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
తారాగణం, విడుదల ప్రణాళిక
పృథ్వీరాజ్ – వైశాఖ్ కాంబినేషన్
పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానులు ‘ఖలీఫా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన ఇస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ రివెంజ్ థ్రిల్లర్ చిత్రం భారీ అంచనాల మధ్య 2026లో విడుదల కానుంది.



Kriti Sanon’s Bold Move: Ditching Routine for ‘Psycho Roles’ – Shocking Revelation!