
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్‌హాట్‌గా మారింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి హౌస్‌లోకి వచ్చి నామినేట్ చేయడంతో పాటు, రీఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. ప్రియ, సంజనాల మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్‌గా నిలిచింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే చదవండి.
Key Points
గత సీజన్ నామినేషన్స్ పద్ధతితో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి నామినేట్ చేయనున్నారు.
ప్రియ, సంజనా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, ప్రియ సంజనాను నామినేట్ చేసింది.
ఎలిమినేట్ అయిన వారిలో శ్రీజతో పాటు ఇంకెవరైనా రీఎంట్రీ ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ వారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ ట్విస్ట్
గత సీజన్‌లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ లో ( Bigg Boss Telugu 9 ) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్‌గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!
సంజనాకు క్లాస్ పీకిన ప్రియ ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్‌లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్‌కు కత్తి గుచ్చాడు. సర్‌ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్‌నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రియ, సంజనా మధ్య తీవ్ర వాగ్వాదం
నామినేషన్స్‌లో ఎనిమిదిమంది సోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్‌బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్‌లో అడుగుపెడతారా? చూడాలి!
రీఎంట్రీతో సస్పెన్స్‌లో బిగ్‌బాస్
బిగ్‌బాస్ 9లో రీఎంట్రీ, తీవ్ర నామినేషన్స్‌తో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రియ, సంజనా వాగ్వాదం, లీకైన నామినేషన్స్ లిస్ట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. రాబోయే ఎపిసోడ్‌లలో మరిన్ని ట్విస్ట్‌లు ఊహించవచ్చు.


