
సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ అనే అంశంపై నటి ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మార్కెట్ విలువను బట్టి డిమాండ్ చేస్తానని చెప్పింది. అలాగే, నార్త్, సౌత్ పని విధానం, సమయపాలనలో ఉన్న తేడాలను వివరించింది.
Key Points
హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ నిజమేనని ప్రియమణి అంగీకరించింది.
తన మార్కెట్ వాల్యూను బట్టే పారితోషికం డిమాండ్ చేస్తానని ప్రియమణి పేర్కొంది.
సౌత్‌లో సమయపాలన ఉంటుందని, నార్త్‌లో టైమ్‌కు రారని ఆమె తెలిపింది.
'ది ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్‌లో ప్రియమణి నటిస్తోంది.
రెమ్యునరేషన్‌పై ప్రియమణి వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు రెమ్యునరేషన్ తక్కువే. ఇది ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. దీనిపై రీసెంట్ గా ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న బర్నింగ్ టాపిక్ రెమ్యునరేషన్ పై ప్రియమని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ పారితోషికం ఇవ్వడంపై స్పందించింది. ప్రియమణి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి అనేక భాషల సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ నటి న్యూస్18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేల్ కో స్టార్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకోవడంపై రియాక్టయింది.
సౌత్, నార్త్ పనితీరులో తేడాలు
“అది నిజమే. కానీ పర్వాలేదు. మీ మార్కెట్ విలువ ఎంత ఉంటే, మీరు దాన్ని బట్టి రెమ్యునరేషన్ అడగాలి. అంత మీకు లభిస్తుంది అని నేను నమ్ముతా. కొన్నిసార్లు నా పురుష సహనటుడి కంటే నాకు తక్కువ పారితోషికం ఇచ్చారు. అయితే, అది నన్ను ఇబ్బంది పెట్టదు. నా మార్కెట్ విలువ, నా అర్హత నాకు తెలుసు. ఇది నా అభిప్రాయం, నా అనుభవం. నేను దేనికైతే అర్హురాలిని అని నమ్ముతానో, అదే డిమాండ్ చేస్తాను. అనవసరమైన పెంపును అడగను” అని ప్రియమణి చెప్పింది.
“రెండు చోట్లా (సౌత్ , నార్త్) పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. సౌత్‌లో వారు సాధారణంగా సమయానికి ప్రారంభిస్తారు. ఉదయం 7 లేదా 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. మేము 8 గంటలు అంటే, ఏమైనా సరే మేము 8 గంటలకే ప్రారంభిస్తాము. ఇక్కడ (నార్త్‌లో) మీరు 8 గంటలు అంటే, ఆ సమయానికి ప్రజలు సెట్‌కి వస్తారు అని నేను గమనించా” అని ఆమె చెప్పింది.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లో ప్రియమణి
మనోజ్ బాజ్‌పాయితో కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడవ సీజన్‌లో కూడా ప్రియమణి కనిపించనుంది. రాజ్ అండ్ డికె రూపొందించిన ఈ సిరీస్‌లో షారిబ్ హష్మి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా కూడా నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది.
ప్రియమణి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్, పనితీరుపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పిన ప్రియమణి, రాబోయే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది.


