
📌 Key Points
- ప్రియాంక చోప్రా కెరీర్ తొలుత తమిళ చిత్రం ద్వారా ప్రారంభమైంది.
- ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు రుద్రగా, ప్రియాంక మందాకినిగా నటిస్తున్నారు.
- రాజమౌళి దర్శకత్వంలో, కె.వి విజయేంద్ర ప్రసాద్ కథతో ‘వారణాసి’ చిత్రం తెరకెక్కుతోంది.
- తెలుగు డైలాగ్స్ చెప్పడంలో రాజమౌళి సహాయం చేస్తున్నారని ప్రియాంక తెలిపింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలుగు భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న ఆమె, తెలుగు డైలాగ్స్ చెప్పడం కష్టమని, రాజమౌళి సహాయం చేస్తున్నారని అన్నారు.
ప్రియాంక చోప్రా సినీ ప్రస్థానం
Priyanka Chopra:గ్లోబల్ స్టార్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తమిళ చిత్రం ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. తెలుగులో కూడా అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అలా తన సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో రుద్రగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కనిపించనున్నారు. ఈ విషయాలను అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక పాత్ర
శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. పైగా రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత కె.వి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ఆధారంగానే ఈ వారణాసి చిత్రాన్ని గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో.. మరొకవైపు ఇప్పటినుంచే ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టింది చిత్ర బృందం.
అలా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రాతో తెలుగుభాషతో మీ ప్రయాణం ఎలా ఉంది? అని ప్రశ్నించగా.. “నాకు తెలుగు అస్సలు రాదు. నిజానికి తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. మామూలుగా మాట్లాడడం ఒక ఎత్తైతే.. కెమెరా ముందు డైలాగు చెప్పడం మరో ఎత్తు. ముఖ్యంగా ఈ విషయంలో రాజమౌళి నాకు సహాయం చేశారు. ఆయన నాకు డైలాగ్ అర్థం చెబుతారు. పాత్ర ఇంటెన్షన్ ను వివరిస్తారు. ఇక దాన్ని బట్టి ఒక పది నిమిషాలపాటు నేను దానిపై వర్క్ చేసి అప్పుడు నా స్టైల్ లో నేను డైలాగ్ చెబుతున్నాను. నిజానికి అది అంత ఈజీ కాదు. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమౌళి చొరవతో నేను తెలుగు మాట్లాడగలుగుతున్నాను” అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.
తెలుగు డైలాగ్స్ పై ప్రియాంక కామెంట్స్
ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు బాలీవుడ్లో క్రిష్ 4లో కూడా ప్రియాంక చోప్రా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బడ్జెట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కొంతకాలం వాయిదా వేయనున్నారట. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా మాత్రం ఇప్పుడు వరుస ఇండియన్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.
ప్రియాంక చోప్రా తెలుగు భాష గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సహాయంతో ఆమె తెలుగులో డైలాగులు చెబుతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.


