
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వర్జినిటీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలకు నెటిజన్ల నుండి వ్యతిరేక మరియు అనుకూల స్పందనలు వస్తున్నాయి.
Key Points
ప్రియాంక చోప్రా వర్జినిటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
నెటిజన్లు వ్యతిరేక మరియు అనుకూల స్పందనలు వ్యక్తం చేశారు.
పెళ్లి ముందు వర్జినిటీ కోల్పోవడంపై విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రజెంట్ బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. భర్త, బిడ్డతో ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గతంలో వర్జినిటీ గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వర్జినిటీ ఉన్న భార్య దొరకాలని కోరుకోకండి. గుడ్ మ్యానర్స్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రిలోనే ఎండ్ అవుతుంది.. కానీ గుడ్ మ్యానర్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అబ్బాయిలకు సలహా ఇచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కొందరు అంటుంటే.. అలాంటప్పుడు అమ్మాయిలు కూడా సక్సెస్‌ఫుల్, ఎంప్లాయిడ్ మెన్ గురించి వెతకకుండా గుడ్ మ్యానర్స్ ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఇంకొందరు చెప్తున్నారు. అసలు పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోయిన అమ్మాయిలకు గుడ్ మ్యానర్స్ ఎలా ఉంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. షారుఖ్‌తో పీసీ రిలేషన్ గురించి కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
నెటిజన్ల స్పందనలు
ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పద చర్చకు దారితీశాయి. వ్యక్తిగత విలువలు, సంప్రదాయాలు, ఆధునిక దృక్పథాల మధ్య సంఘర్షణను ఈ చర్చ హైలైట్ చేసింది.


