|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రియాంక చోప్రా విడాకులపై సంచలన నిజాలు: మమ్మల్ని విడదీయాలని చూశారు! అసలు రహస్యం బట్టబయలు!

Published: 26-03-2026, 3:35 AM
ప్రియాంక చోప్రా విడాకులపై సంచలన నిజాలు: మమ్మల్ని విడదీయాలని చూశారు! అసలు రహస్యం బట్టబయలు!
  • ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.
  • ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్‍గా రెండుసార్లు కనిపించారు.
  • రాజమౌళి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించనున్నారు.
  • విడాకుల రూమర్లపై ప్రియాంక తీవ్రంగా స్పందించారు.

ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా తన విడాకుల వార్తలపై స్పందిస్తూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆమె మరియు నిక్ సంతోషంగా ఉన్నామని, కొందరు తమను విడదీయాలని చూస్తున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా కెరీర్ విశేషాలు

Priyanka Chopra:మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. బాలీవుడ్లో కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్గా అవకాశాలు తగ్గిపోవడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయిన ప్రియాంక చోప్రా.. దాదాపు 8 ఏళ్లపాటు కష్టపడి ఊహించని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నేడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్ గా రెండుసార్లు కనిపించి.. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఆస్కార్ వేడుకపై ఏకంగా రెండుసార్లు ప్రజెంటర్ గా పనిచేసిన నటిగా చరిత్ర సృష్టించింది ప్రియాంక చోప్రా.

అలాంటి ఈమె ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే రాజమౌళి కూడా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. ఇక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా.. గత నాలుగేళ్లుగా విడాకులు తీసుకోబోతోంది అంటూ వస్తున్న రూమర్లకి గతంలోనే స్పందించి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయినా సరే రూమర్లు ఆగకపోవడంతో మరొకసారి స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

విడాకుల రూమర్లపై ప్రియాంక స్పందన

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “నేను సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫోటో పెడితే చాలు ఏవేవో ఊహించుకుంటూ కొంతమంది అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను నిక్ జోనస్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేమిద్దరం జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నాము. బయటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వము. అయితే మేము విడాకులు తీసుకుంటున్నాం అంటూ కొన్ని కథనాలు వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. మా వివాహ బంధం ముగిసిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము వేర్వేరు దేశాలకు చెందినవారిమి మాత్రమే కాదు వేర్వేరు మతాలకు కూడా చెందిన వాళ్ళం.. పైగా మా ఇద్దరి మధ్య వయసు తేడా కూడా ఉంది. ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.

రాజమౌళి సినిమాలో ప్రియాంక

కానీ ఎనిమిదేళ్లుగా మేము మా వైవాహిక బంధంలో చాలా సంతోషంగా ఉన్నాము. నిక్ జోనస్ పరిచయమైన తర్వాత ఆరు నెలలకే మేము వివాహం చేసుకున్నాము. మా గురించి ఎవరు ఏమనుకున్నా మేము పట్టించుకోము. ఎప్పటికీ మేము కలిసే ఉంటాము. పుకార్లు మాత్రం నమ్మకండి” అంటూ రూమర్స్ కి చెక్ పెట్టింది ప్రియాంక చోప్రా. మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.

ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితం గురించి వస్తున్న పుకార్లను ఖండించింది. తన దృష్టి ప్రస్తుతం తన కెరీర్ పైనే ఉందని స్పష్టం చేసింది. ఆమె త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి నటించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.