|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ప్రియాంక గాంధీ! తొలి ఓటమి రుచి చూపించామంటూ సంచలన వ్యాఖ్యలు!

Published: 18-04-2026, 7:05 AM
ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ప్రియాంక గాంధీ! తొలి ఓటమి రుచి చూపించామంటూ సంచలన వ్యాఖ్యలు!
  • మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రియాంక గాంధీ ఎన్డీఏపై విమర్శలు.
  • ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఓటమి రుచి చూపిచామన్న ప్రియాంక.
  • రిజర్వేషన్ల పేరుతో స్థానాల పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంక గాంధీ.
  • మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత బిల్లు తీసుకురావాలని డిమాండ్.

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ఓటమి రుచి చూపించామని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎన్డీఏపై ప్రియాంక గాంధీ విమర్శలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ఢిల్లీ (Delhi)లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇది అధికార ఎన్‌డీఏ (NDA) కూటమికి ఒక చీకటి రోజని, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఓటమి రుచి చూపించామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న సభలో పరిణామం ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయమని కామెంట్ చేవారు. సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలపై ప్రతిపక్షాల ఐక్యత సాధించిన విజయమి ఇదని ఆమె కొనియాడారు.

అధికారంలో శాశ్వతంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర పన్నిందని ప్రియాంకా ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, అందుకే ప్రతిపక్షాలు దీనిని అడ్డుకున్నాయని ఆమె స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇస్తామంటూ మహిళలను మభ్యపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ దేశంలోని మహిళలు అంత అమాయకులు కాదని ఆమె అన్నారు. ఉన్నావ్‌ (Unnaav), హాథ్రస్ (Hathras) ఘటనలను మనం చూశామని.. మణిపూర్‌ (Manipur)లో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ఉందని ఫైర్ అయ్యారు. మహిళల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2023లో ప్రవేశపెట్టిన పాత వెర్షన్ బిల్లును తీసుకురావాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లపై ప్రియాంక ఆరోపణలు

ప్రభుత్వానికి ప్రియాంక డిమాండ్

మొత్తానికి ప్రియాంక గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాత బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.