|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హాట్ టాపిక్‌గా మారిన ప్రియాంక మోహన్ బోల్డ్ ఫొటోస్.. దయచేసి వాటిని షేర్ చేయొద్దంటూ వార్నింగ్

Published: 11-10-2025, 7:32 AM
హాట్ టాపిక్‌గా మారిన ప్రియాంక మోహన్ బోల్డ్ ఫొటోస్.. దయచేసి వాటిని షేర్ చేయొద్దంటూ వార్నింగ్

టాలీవుడ్ నటి ప్రియాంక మోహన్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారారు. ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి AI జనరేటెడ్ ఫొటోలని, వాటిని షేర్ చేయొద్దని నటి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Key Points

1

నటి ప్రియాంక మోహన్ AI జనరేటెడ్ బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2

తనను తప్పుగా చిత్రీకరించేందుకు ఈ ఫొటోలను షేర్ చేయవద్దని ప్రియాంక మోహన్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

4

‘ఓజీ’ సినిమాలోని కాస్ట్యూమ్స్‌తో ఈ ఫొటోలను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రియాంక మోహన్ బోల్డ్ AI ఫొటోల వివాదం

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఇటీవల ‘ఓజీ’(OG) సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సుజిత్(Sujith) కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమ్మడుకి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అందులో ఆమె సెక్సీగా ఉండి రెచ్చగొట్టేలా తన అందాలను చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది.

AI ఫొటోలపై నటి ప్రియాంక మోహన్ స్పందన

ఇక వాటిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇవి కాస్త ప్రియాంక మోహన్ కంటపడటంతో.. ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘‘నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని ఏఐ జనరేటెడ్ ఫొటోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వాటిని షేర్ చేయడం ఆపేయండి. ఏఐ సైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

నెటిజన్ల మద్దతు, సోషల్ మీడియా స్పందన

ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి.. అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ప్రియాంకకు సపోర్ట్‌గా నిలుస్తు్న్నారు. కాగా.. ఈ ఫొటోలు ‘ఓజీ’ సినిమాలోని సువ్వి.. సువ్వి సాంగ్ కాస్ట్యూమ్‌లో ఉన్నవని తెలుస్తోంది. దీనిని అదునుగా తీసుకున్న నెటిజన్లు కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. హీరోయిన్లకు ఇలా కావడం ఇదేమి మొదటి సారి కాదు. ఏఐ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఇలా ఇబ్బంది పడినవారే.

AI దుర్వినియోగం వల్ల హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రియాంక మోహన్ ఉదంతం మరో ఉదాహరణ. డిజిటల్ కంటెంట్‌ను పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండటం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.