|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Producer SKN : రష్మిక సినిమా చూసి చున్నీ తీసేసిన అమ్మాయి.. కౌంటర్ ఇచ్చిన SKN..

Published: 13-11-2025, 12:50 AM
Producer SKN : రష్మిక సినిమా చూసి చున్నీ తీసేసిన అమ్మాయి.. కౌంటర్ ఇచ్చిన SKN..

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విడుదలై ప్రేక్షకుల్లో ఒక సెక్షన్ ని మెప్పించింది. ఈ సినిమా చూసి ఓ అమ్మాయి తన చున్నీని తీసేసి లైఫ్ ని ఫేస్ చేస్తాను అనడం వైరల్ అయ్యింది. దీనిపై నిర్మాత SKN తన అభిప్రాయాన్ని, కౌంటర్ ని స్పష్టంగా తెలియజేశారు.

Key Points

1

రష్మిక నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా విడుదల తర్వాత ఓ ఘటన చోటు చేసుకుంది.

2

సినిమా స్ఫూర్తితో ఓ అమ్మాయి చున్నీ తీసేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4

నిర్మాత SKN ఆ సంఘటనపై స్పందిస్తూ, ఆ అమ్మాయికి, నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రభావం

Producer SKN : ఇటీవల రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజయింది. ఈ సినిమాలో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయి ఎలా ఇబ్బందిపడుతుంది అనే కథని చూపించారు. ఈ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమా చూసి కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ రివ్యూలను చెప్తూ, కొంతమంది తాము కూడా అలా ఫేస్ చేశామని చెప్తూ పోస్టులు పెడుతున్నారు.(Producer SKN)

ఇటీవల రాహుల్ రవీంద్రన్ ఓ థియేటర్ కి వెళ్ళాడు. అక్కడ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రాహుల్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి రాహుల్ దగ్గరికి వచ్చి సినిమా బాగుందని చెప్పి, సినిమా చివర్లో రష్మిక చున్నీ తీసేసినట్టు తాను కూడా తీసేస్తాను అని మెడలో ఉన్న చున్నీ తీసేసి లైఫ్ ని ఫేస్ చేస్తాను అని తెలిపింది. దానికి రాహుల్ నాకు ఇది నచ్చింది అని ఆ అమ్మాయిని హగ్ చేసుకోవడంతో వీడియో వైరల్ గా మారింది.

చున్నీ తీసేసిన అమ్మాయి వీడియో వైరల్

ఆ అమ్మాయి చేసిన దానిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. పలువురు సినిమాలో మెసేజ్ అర్ధం చేసుకోమంటే ఇలా చున్నీలు తీయమని కాదు అని ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు. మరికొంతమంది ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై నిర్మాత SKN స్పందించాడు.

నిర్మాత SKN స్ట్రాంగ్ రియాక్షన్

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో SKN మాట్లాడుతూ.. బంగారు తల్లులు రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు. మా చున్నీల సేల్స్ పడిపోతాయి అని. అందుకే చున్నీ వేసుకొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. మీకు కంఫర్ట్ గా ఉంటె ఏ డ్రెస్ అయినా వేసుకోండి కానీ ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని వదిలేయండి అని అంతే కానీ వేరే ఏది వదిలేయమని కాదు అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి వీడియో, SKN స్పీచ్ లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మొత్తానికి, రష్మిక సినిమా స్ఫూర్తితో జరిగిన ఈ సంఘటన, దానికి SKN ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సినిమా మెసేజ్ ని సరైన విధంగా అర్థం చేసుకోవాలని SKN మాటలు సూచించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.