|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ట్విస్ట్: పునర్నవి భూపాలం పెళ్లి పీటలెక్కబోతోంది! వరుడు ఎవరంటే?

Published: 17-02-2026, 1:05 AM
షాకింగ్ ట్విస్ట్: పునర్నవి భూపాలం పెళ్లి పీటలెక్కబోతోంది! వరుడు ఎవరంటే?
  • బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం నిశ్చితార్థం చేసుకున్నారు.
  • మార్చి 20న పునర్నవి భూపాలం వివాహం జరగనుంది.
  • పునర్నవి కాబోయే భర్త యూఎస్ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
  • ఉయ్యాల జంపాల సినిమాతో పునర్నవి నటిగా పరిచయమయ్యారు.

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుడు యూఎస్ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

పునర్నవి భూపాలం నిశ్చితార్థం

Punarnavi Bhupalam: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతూ అభిమానులలో సందడి వాతావరణాన్ని నింపుతున్నారు.. అందులో భాగంగానే ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. లోలోపలే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. మరొకవైపు అల్లు శిరీష్(Allu Sirish) కూడా తన ప్రేయసి నయానికా రెడ్డి(Nayanika Reddy)తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.. ఇప్పటికే ఆయన కుటుంబంలో హల్దీ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ ఏడడుగులు వేయడానికి సిద్ధం అయ్యింది.

ఆమె ఎవరో కాదు ప్రముఖ బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ పునర్నవి భూపాలం. 2013లో అవికా గోర్ , రాజ్ తరుణ్ జంటగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల ‘ సినిమా ద్వారా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి ఉత్తమ సహాయక నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది. అలా మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏడడుగులు వేయబోతోంది. అందులో భాగంగానే నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. తన కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతున్న ఫోటోలను అలాగే తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలను పునర్నవి షేర్ చేస్తూ నిశ్చితార్థమైనట్టు అందరికీ అధికారికం చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వరుడు ఎవరు? ఏం చేస్తుంటారు?

ఇకపోతే మార్చి 20వ తేదీన పునర్నవి భూపాలం ఏడడుగులు వేయబోతోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇదిలా ఉండగా పునర్నవి కాబోయే భర్త ఎవరు? అని అభిమానుల సైతం ఆరా తీయగా ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. యూఎస్ఏ కి చెందినవారు.. మొత్తానికైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పునర్నవి ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యింది . ఇక మార్చి 20వ తేదీన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను నేరుగా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

మార్చి 20న వివాహం

2015లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే చిత్రంలో నటించిన ఈమె ఆ తర్వాత సూపర్ హిట్ గ్యారెంటీ, పిట్టగోడ , మనసుకు నచ్చింది, ఎందుకో ఏమో , ఒక చిన్న విరామం, సైకిల్ అంటూ ఇలా పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్గా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. అలాగే కమిట్ మెంటల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది పునర్నవి. పునర్నవి ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1996 మార్చి 28న జన్మించారు.

మొత్తానికి పునర్నవి భూపాలం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఆమెకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.