|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పురుషః మూవీ: దేవ నాయకి సాంగ్ రిలీజ్! ఐటెం సాంగ్‌తో దుమ్ము రేపిన పవన్ బత్తుల!

Published: 27-02-2026, 11:35 AM
పురుషః మూవీ: దేవ నాయకి సాంగ్ రిలీజ్! ఐటెం సాంగ్‌తో దుమ్ము రేపిన పవన్ బత్తుల!
  • పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా ‘పురుషః’ మూవీ గ్రాండ్ ఎంట్రీ!
  • అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.
  • శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం దేవ నాయకి సాంగ్ అదిరింది!
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పురుషః’ మూవీ!

పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా నటిస్తున్న ‘పురుషః’ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోని దేవ నాయకి సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా త్వరలోనే మీ ముందుకు రానుంది.

‘పురుషః’ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్!

Purushaha: పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్నలేటెస్ట్ మూవీ పురుషః(Purushaha). అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వీరు ఉలవల తెరకెక్కిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ సినిమాను బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పిస్తున్నాయి.

ఈనేపథ్యంలోనే, తాజాగా పురుషః సినిమా నుంచి దేవ నాయకి అంటూ సాగే ఎనర్జిటిక్ పాటను విడుదల చేశారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ అందించిన అద్భుతమైం ట్యూన్ కి అనంత్ శ్రీరామ్ అంతే అద్భుతమైన లిరిక్స్ ని అందించాడు. సాహితి చాగంటి పాడిన ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తోంది. అలాగే ఈ సాంగ్ సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది. ఇప్పిటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

దేవ నాయకి సాంగ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్.

పవన్ కల్యాణ్ బత్తుల, అనైరా గుప్తా జంట!

‘పురుషః’ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.