|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పుష్ప 3: అనుష్క ఎంట్రీతో షాక్! బన్నీ మూవీలో ఊహించని ట్విస్ట్!

Published: 25-03-2026, 10:05 PM
పుష్ప 3: అనుష్క ఎంట్రీతో షాక్! బన్నీ మూవీలో ఊహించని ట్విస్ట్!
  • పుష్ప 3లో అనుష్క శర్మ ఎంట్రీ? వైరల్ అవుతున్న వార్త!
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మళ్ళీ రిపీట్ కానుందా?
  • మూడో పార్ట్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు!
  • విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఇప్పుడు పుష్ప 3 గురించి ఒక బిగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం!

అనుష్క శర్మ రీఎంట్రీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప 2 రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ సన్నద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఓ ప్రత్యేక ఆఫీస్ ను తీసుకొని ప్రాజెక్టు పైన వర్క్ చేస్తున్నారట సుకుమార్. అయితే ఈ నేపథ్యంలో పుష్ప 3 సినిమాలో అనుష్క శర్మ నటిస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

పుష్ప 3లో విజయ్ దేవరకొండ?

తన భర్తతో కలిసి లండన్ లోనే ఉంటున్న అనుష్క శర్మ, 8 సంవత్సరాల తర్వాత మళ్లీ స్క్రీన్ పైన కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు నడుస్తోంది. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనుష్క శర్మ నటిస్తుందని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పుష్ప 3 అంటున్నారు. ఇందులో అనుష్క శర్మకు స్పెషల్ రోల్ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా పుష్ప 3 సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా పుష్ప ప్రాజెక్టులో హీరోగా అల్లు అర్జున్ నటించగా, హీరోయిన్ గా రష్మిక మెరిశారు. ఈ ప్రాజెక్టులో యాంకర్ అనసూయ, సునీల్, సందడి చేయగా మొదటి సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. రెండో పార్ట్ లో శ్రీ లీల స్టెప్పులు ఇరగదీసింది.

సుకుమార్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

A post shared by filmytown.in (@filmytown.in)

పుష్ప 3 గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.