|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రియల్ లైఫ్‌లో పుష్ప సీన్.. నదిలో భారీ మొత్తంలో దుంగలు..(వీడియో)

Published: 26-06-2025, 4:17 AM
రియల్ లైఫ్‌లో పుష్ప సీన్.. నదిలో భారీ మొత్తంలో దుంగలు..(వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని ఓ సన్నివేశం ఇప్పుడు నిజ జీవితంలో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో భారీగా దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ ఘటన వాతావరణ మార్పుల తీవ్రతను చూపిస్తుంది.

Key Points

1

పుష్ప సినిమాలోని నదిలో దుంగలు పడేసే సీన్ నిజ జీవితంలోనూ జరిగింది.

2

హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో భారీ మొత్తంలో దుంగలు కొట్టుకువచ్చాయి.

4

మానవాళి మనుగడకు అడవులను కాపాడటం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తుంది.

పుష్ప సినిమా సన్నివేశం నిజ జీవితంలో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సాఫీసును షేక్ చేసింది. పాన్ ఇండియా మూవీగా సత్తా చాటింది. రెండు పార్టులు కూడా సూపర్ కలెక్షన్స్ సాధించి.. ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేశాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్‌పై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్‌గా, గుట్కా పాన్ నమిలే వ్యక్తిగా.. పోలీసులను అవమానించిన గూండాగా.. నటించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారని క్రిటిక్స్ ప్రశ్నలు సంధించారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. పోలీసుల కంట పడకుండా ఎర్రచందనం తీసుకెళ్లేందుకు దుంగలను నదిలో పడేసిన సీన్ గుర్తింది కదా.. అదే సీన్ రియల్ లైఫ్‌లోనూ జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు వ్యాలీలో ఈ సీన్ కనిపించగా.. బియాస్ నదిలో భారీ మొత్తంలో దుంగలు కొట్టుకొచ్చాయి. ఈ క్లిపింగ్ చూస్తుంటే అడవుల నరికివేత ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుంది? సంబంధం లేకుండా వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణ మార్పులు ఎందుకు జరుగుతున్నాయనేది అర్థమవుతుంది. మానవాళి మనుగడకు అడవులను కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది.

బియాస్ నదిలో భారీ దుంగలు

అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పులు

ఈ ఘటన అడవుల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం గురించి మనందరికీ హెచ్చరిక. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.