|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

PVNS రోహిత్: ‘బేబి’ సింగర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?

Published: 08-08-2025, 3:46 AM
PVNS రోహిత్: 'బేబి' సింగర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?

నేషనల్ అవార్డు గ్రహీత పీవీఎస్ఎన్ రోహిత్ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించాడు. ‘బేబి’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాటతో పేరు తెచ్చుకున్న రోహిత్, తన ప్రేయసి డాక్టర్ శ్రేయతో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Key Points

1

నేషనల్ అవార్డు విజేత పీవీఎస్ఎన్ రోహిత్ నిశ్చితార్థం

2

'బేబి' సినిమా పాటతో పేరు తెచ్చుకున్న రోహిత్

4

సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక

‘బేబి’ సింగర్ రోహిత్ నిశ్చితార్థం

రీసెంట్‌గా జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌కి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ‘బేబి’ సినిమాలో ‘ప్రేమిస్తున్నా..’ అనే పాట పాడిన పీవీఎస్ఎన్ రోహిత్ అనే తెలుగు కుర్రాడు.. ఉత్తమ సింగర్‌గా నిలిచాడు. ఇది జరిగి ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేశాడు.

రోహిత్.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. చాలా పాటలు పాడాడు. ‘బేబి’ సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జైలర్, హనుమాన్, ప్రేమలు, కొండపొలం, సరిపోదా శనివారం, నేల టికెట్ తదితర చిత్రాల్లోనూ తనదైన గొంతుతో పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించాడు. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.

డాక్టర్ శ్రేయతో వివాహ నిశ్చితార్థం

చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న డాక్టర్ శ్రేయ అనే అమ్మాయితో రోహిత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభకార్యం సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టగా.. తోటి సింగర్స్, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి విషయం గురించి కూడా రోహిత్ చెబుతాడేమో చూడాలి?

సోషల్ మీడియాలో శుభవార్త

పీవీఎస్ఎన్ రోహిత్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, సహ కళాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే వివాహ వార్తలు వినవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.