|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ప్రీ టీజర్..

Published: 15-06-2025, 5:26 AM
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ప్రీ టీజర్..

ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10.52 గంటలకు టీజర్ విడుదల అవుతుందని తెలిపారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.

Key Points

1

ప్రభాస్, మాళవిక మోహనన్ నటించిన 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

2

జూన్ 16న ఉదయం 10.52 గంటలకు టీజర్ విడుదల

4

ప్రీ టీజర్ వీడియో ఆసక్తిని పెంచుతోంది

రాజా సాబ్ టీజర్ విడుదల తేదీ

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ (Raaja Saab) ఒకటి. స్టార్ డైరెక్టర్ మారుతి(Maruthi) ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేక‌ర్స్. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జూన్ 16న టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్. తాజాగా దీనికి సంబంధించి మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు డైరెక్టర్ మారుతి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10.52 గంటల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుపుతూ ప్రీ టీజర్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో టీజర్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

చిత్ర బృందం ప్రకటన

ప్రీ టీజర్ వీడియో

మొత్తానికి, రాజా సాబ్ సినిమా టీజర్ విడుదలకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రీ టీజర్ వీడియో ఆసక్తిని మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.