
రాశీ ఖన్నా, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ‘పిచ్చి ము*డ’ అనే పదాన్ని తాను తెలియక వాడానని, అది బూతు పదమని తనకు తెలియదని ఆమె వివరించింది.
Key Points
రాశీ ఖన్నా, సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'తెలుసు కదా' సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
ఓ పాడ్‌కాస్ట్‌లో రాశీ ఖన్నా 'పిచ్చి ము*డ' అనే పదం వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ పదం బూతు అని తనకు తెలియదని, అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని రాశీ ఖన్నా వివరణ ఇచ్చింది.
సిద్ధు జొన్నలగడ్డ కూడా రాశీఖన్నాకు మద్దతుగా మాట్లాడుతూ ఆమెకు ఆ పదం గురించి తెలియదని తెలిపారు.
రాశీ ఖన్నా వ్యాఖ్యలు.. వివాదం ఎందుకు?
రాశీ ఖన్నా(Raashi Khanna), సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాశీఖన్నా సిద్ధు జొన్నలగడ్డ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిస్తుంటే తానొక పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయానని అనేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమెకు తెలిసి అన్నదా? లేక తెలియక అన్నదా అని అంతా అయోమయంలో పడిపోయారు. మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, రాశీ ఖన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘నిజంగా అది బూతు పదమని నాకు తెలయిదు. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నాను. అందుకే అలా అనేసాను. ఆ తర్వాత నా ఫ్రెండ్ అసలు విషయం చెప్పింది’’ అని చెప్పుకొచ్చింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ సైతం స్పందిస్తూ.. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్‌కు ఉపయోగించారు. రాశీఖన్నా క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడింది.. తనకి తెలియదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. తెలియకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
‘పిచ్చి ము*డ’ పై రాశీ ఖన్నా వివరణ
సిద్ధు జొన్నలగడ్డ మద్దతు.. నెటిజన్ల రియాక్షన్
రాశీ ఖన్నా ‘పిచ్చి ము*డ’ పదంపై ఇచ్చిన వివరణతో నెటిజన్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలియక అన్నదా? తెలిసి అన్నదా? అనే చర్చకు తాత్కాలికంగా తెరపడింది. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.


