
📌 Key Points
- రాశీ ఖన్నా: తన బాగోగులు చూసుకునే వ్యక్తికి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాశీ ఖన్నా బర్త్ డే ట్వీట్
- పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్
- సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో రాశీ ఖన్నా నటనకు ప్రశంసలు
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా తను చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం రండి.
రాశీ ఖన్నా ఎమోషనల్ ట్వీట్ వైరల్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
బ్రదర్‌తో రాశీ ఖన్నా ఫన్నీ ఫోటోలు
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా జీవితాంతం – ప్రమాదం నుండి – రక్షించుకుంటూ వస్తున్న ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ నిజంగా, నా స్థిరత్వం, నా బలం మరియు నా సురక్షితమైన ప్రదేశం నువ్వే. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని రాసుకొస్తూ తన బ్రదర్స్‌తో తీసుకున్న కొన్ని ఫన్నీ ఫొటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అతని బ్రదర్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశీ
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశీ ఖన్నా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె తన బ్రదర్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


