|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టికెట్ రేట్లపై రాధికా శరత్ కుమార్ ఫైర్! స్టార్ హీరోలకు దిమ్మతిరిగే కౌంటర్!!

Published: 12-03-2026, 3:35 AM
షాకింగ్: టికెట్ రేట్లపై రాధికా శరత్ కుమార్ ఫైర్! స్టార్ హీరోలకు దిమ్మతిరిగే కౌంటర్!!
  • రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు: టికెట్ రేట్లపై స్టార్ హీరోలకు గట్టి కౌంటర్!
  • తమిళ చిత్రం ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్‌లో రాధిక కామెంట్స్ వైరల్.
  • రూ.150 టికెట్ రేటుతో ‘తాయి కిళవి’ రూ.60 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
  • పెద్ద హీరోల టికెట్ రేట్లపై రాధిక విమర్శలు: కంటెంట్ ఉంటే భారీ వసూళ్లు ఖాయం!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

టికెట్ రేట్లపై రాధిక సంచలన వ్యాఖ్యలు

Radhika Sarathkumar : ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు దారుణంగా పెంచేస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు నిర్మాతలు. తెలుగులోనే కాదు, తమిళ్, బాలీవుడ్ లో కూడా టికెట్ రేట్లు స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగానే ఉంటున్నాయి. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కనీసం మూడు రోజులకు మొదటి వీకెండ్ అయ్యాక కూడా టికెట్ రేట్లు తగ్గించట్లేదు.

తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ టికెట్ రేట్లపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చారు. రాధికా శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో ఓ ముసలి పాత్రలో నటించిన తమిళ సినిమా తాయి కిళవి ఇటీవల రిలీజయి పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసి థియేటర్స్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

‘తాయి కిళవి’ సక్సెస్‌తో రాధికా కామెంట్స్

తాయి కిళవి సినిమా సక్సెస్ మీట్ లో రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆల్మోస్ట్ 60 కోట్లు కలెక్ట్ చేసింది కేవలం 150 రూపాయలు టికెట్ రేటుతో. కొంతమంది పెద్ద హీరోలు తమ సినిమాల టికెట్స్ ని 1500 నుంచి 2000 వరకు కూడా అమ్ముతున్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే మేము వాళ్ళకంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే. ఇది నిజమైన సక్సెస్ అని కామెంట్స్ చేసింది.

స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చిన రాధిక

దీంతో రాధికా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోలకు కౌంటర్ ఇచ్చిందని, ఇప్పటికైనా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అయి కలెక్షన్స్ వస్తాయని తెలుసుకోవాలని, టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రాధిక శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.