|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాహువు-చంద్రుల కలయిక ఈ 5 రాశులకు వరం.. ఉద్యోగాలు, ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలతో పాటు బోలెడు లాభాలు!

Published: 18-06-2025, 8:18 AM
రాహువు-చంద్రుల కలయిక ఈ 5 రాశులకు వరం.. ఉద్యోగాలు, ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలతో పాటు బోలెడు లాభాలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు-చంద్రుల కలయిక కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది. జూన్ 18 వరకు ఈ గ్రహణ యోగం ఐదు రాశుల వారికి అనేక శుభాలను కలిగిస్తుంది.

Key Points

1

మేష, సింహ, ధనస్సు, కుంభ, మీన రాశుల వారికి శుభ ఫలితాలు.

2

ఉద్యోగాలు, ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి.

4

గ్రహణ యోగం వల్ల అనుకున్నవి సాధించే అవకాశం.

రాహువు-చంద్రుల కలయిక ప్రభావం

గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేటప్పుడు ఇతర గ్రహాలతో సంయోగం జరగడంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు-చంద్రుడి కలయిక మానసిక అస్తిరతను, ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి రాహువు –చంద్రుల కలయికతో ఏర్పడిన గ్రహణ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది.

జూన్ 16న చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 18 సాయంత్రం 6:35 వరకు ఇదే రాశిలో ఉంటుంది. రాహువు కూడా ఇదే రాశిలో ఉండడంతో గ్రహణ యోగం ఏర్పడింది. ఈ గ్రహణ యోగం వలన ఐదు రాశుల వారికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మేష రాశి వారికి రాహువు–చంద్రుల సంయోగం కారణంగా ఏర్పడిన యోగం వలన అనేక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశాలలో ఏదైనా పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో మేష రాశి వారికే ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది.

శుభ ఫలితాలను పొందే 5 రాశులు

సింహ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఎప్పటినుంచో మీ చేతికి రాని ధనం ఇప్పుడు వస్తుంది. పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు ఉంటాయి. కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా కాలం నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వారికి ఇప్పుడు సక్సెస్ వస్తుంది.

కుంభ రాశి వారికి ఈ గ్రహణ యోగం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. రాహువు–చంద్రుడి కారణంగా ఏర్పడిన యోగం కుంభ రాశి వారికి కొత్త ఉద్యోగాలని, కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తుంది. పాత అప్పులను తీరుస్తారు. అనుకున్న వాటిని సాధిస్తారు.

జ్యోతిష్య నిపుణుల సలహా అవసరం

మీన రాశి వారికి ఈ సమయం కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గొడవలు వంటి వాటిని పరిష్కరించుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ రాశిఫలాలను సూచనగా మాత్రమే తీసుకోవాలి. సంపూర్ణ సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.