|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేసీఆర్, గాంధీపై రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు.. మందెక్కువైందా? నెటిజన్ల కౌంటర్లు

Published: 03-10-2025, 12:22 AM
కేసీఆర్, గాంధీపై రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు.. మందెక్కువైందా? నెటిజన్ల కౌంటర్లు

నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియాలో వరుస వివాదాస్పద ట్వీట్లతో కలకలం సృష్టించారు. కేసీఆర్, గాంధీ వంటి ప్రముఖులపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ట్వీట్లపై నెటిజన్లు, సినీ, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర చర్చ జరుగుతోంది.

Key Points

1

నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో వరుస వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచారు.

2

కేసీఆర్ పాలన, హైదరాబాద్ వరదలపై వ్యంగ్యంగా ట్వీట్ చేయగా, గాంధీ మహాత్ముడు కాదంటూ వ్యాఖ్యానించారు.

4

ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు, దుమారానికి దారితీశాయి.

రాహుల్ రామకృష్ణ వివాదాస్పద ట్వీట్లు

అర్జున్ రెడ్డి, జాతిర‌త్నాలు వంటి సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల ద్వారా తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉండే ఆయన పండగ పూట వరుసగా ట్వీట్లతో (controversial tweets) రచ్చ చేస్తున్నారు. ‘హైదరాబాద్ మళ్లీ మునిగింది. హామీలన్నీ విఫలమయ్యాయి. పరిస్థితులు అన్ని చక్కబెట్టేందుకు కేసీఆర్ మళ్లీ రావాలని (KCR comeback) జనం కోరుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదంటూ’ (Gandhi not a saint) మరో ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‍లో మనము ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామో! డంబుల్‌డోర్ తిరిగి వచ్చే రోజుకి ఎదురుచూడలేకపోతున్నాను. అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. వెళ్ళి నన్ను చంపేయండి. ఇప్పటికే విసిగిపోయాను, బోలెడంత అలసిపోయాను’ అని రాసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం జీవించడానికి మరియు ప్రేమించడానికి ద్వేషం లేని మార్గాన్ని కోరుకుంటున్నాము. మనమందరం మానవులమే అంటూ మరో ట్వీట్ చేశారు. ఆయన చేస్తున్న వరుస ట్వీట్లు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారాయి.

అయితే రాహుల్ రామకృష్ణ ఈ విధంగా వరుస ట్వీట్లు ఎందుకు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ ట్వీట్లను బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా కాంగ్రెస్ మద్దతుదారులు కౌంటర్లు ఇస్తున్నారు. ఈక్రమంలో దసరా పూట మందెక్కువైదా? ప్రభుత్వం నీకేం తక్కువ చేసింది అంటూ మండిపడుతున్నారు. మరికొందరు రామకృష్ణ ఎక్స్ ఖాతా హ్యాక్ కు గురైందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏం కష్టమొచ్చిందంటూ కామెంట్స్ చేస్తూన్నారు. మొత్తంగా రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

కేసీఆర్, గాంధీపై చేసిన వ్యాఖ్యలు

నెటిజన్ల స్పందన, కౌంటర్లు

రాహుల్ రామకృష్ణ చేసిన వివాదాస్పద ట్వీట్లు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.