|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rahul Ravindran : అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాకి సంబంధం లేదు, అలా చూపించడానికి కారణం ఇదే..

Published: 07-12-2025, 10:53 AM
Rahul Ravindran : అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాకి సంబంధం లేదు, అలా చూపించడానికి కారణం ఇదే..
  • రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదలైంది.
  • చున్నీ వివాదం, నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న ఈ సినిమా డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయింది.
  • అర్జున్ రెడ్డి సినిమాతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు.
  • క్లైమాక్స్‌లో హీరోయిన్ రంగులు పూసుకోవడం ఆమె వ్యక్తిత్వ బలాన్ని చూపించడానికే అని వివరించారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో, అర్జున్ రెడ్డి సినిమాతో పోలికల గురించి దర్శకుడు వివరణ ఇచ్చారు. క్లైమాక్స్ సన్నివేశం వెనుక ఉన్న అసలు కారణాన్ని, హీరోయిన్ క్యారెక్టర్ గ్రాఫ్‌ను స్పష్టం చేశారు.

సినిమాకు మిశ్రమ స్పందన, ట్రోలింగ్

Rahul Ravindran : రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అమ్మాయిలు ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. అదే స్థాయిలో ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక సినిమా అందరికీ నచ్చాలి అని రూల్ లేదు కాబట్టి కొంతమంది ఈ సినిమాను వ్యతిరేకించిన వాళ్లు కూడా ఉన్నారు.

అని ఎక్కువ శాతం మంది అమ్మాయిలకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది కొంతమంది ఈ సినిమా మీద విపరీతమైన అనాల్సిస్లు కూడా చేశారు. రాహుల్ రవీంద్రన్ వాటన్నిటినీ కూడా ట్విట్టర్ వేదికగా అప్పట్లోనే షేర్ చేశాడు. మరోవైపు ఒక అమ్మాయి ఈ సినిమా చూసి క్లైమాక్స్లో భావోద్వేగానికి గురై రాహుల్ రవీంద్రన్ తో మాట్లాడుతూ చున్ని తీసిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇలా చున్నీ తీయడం కూడా ఒక ఫ్యాషనా? సినిమా చూసి ఇదే నేర్చుకున్నారా అంటూ అమ్మాయిని విపరీతంగా అప్పట్లో ట్రోల్ చేశారు.

దీని గురించి ఎస్కేఎన్ అని కూడా మాట్లాడుతూ బంగారు తల్లులు మేము సినిమా చూసిందే మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇలా చున్నీలు తీయకండి అంటూ స్టేజి మీద చురకలు అంటించాడు. ఆ తర్వాత నిర్మాత ఎస్కేఎన్ కు స్వయంగా ఆ అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చిన వీడియో కూడా తర్వాత వైరల్ అయింది.

అయితే ఈ సినిమా డిసెంబర్ 5న నెట్ఫ్లిక్స్ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా చూస్తున్న చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. అయితే ఒక నెటిజన్ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ ముఖానికి రంగులు పూయడానికి, అలానే ఆమె వెలుగుని చూస్తున్నప్పుడు ఇబ్బంది పడడానికి అర్జున్ రెడ్డి సినిమా తో ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.

‘ది గర్ల్ ఫ్రెండ్’ ఓటీటీ విడుదల

దీనికి సమాధానంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. భూమా క్యారెక్టర్ ని తగ్గిస్తూ విక్రమ్ అనే వాడు పెయింటింగ్ వేశాడు. మొదట ఆ అమ్మాయిని చాలా సిగ్గుపడే వ్యక్తిగా , చాలా ఇంట్రోవర్ట్ గా చూపించాను. అయితే విక్రం వేసిన రంగులు అవమానంగా ఫీల్ అవ్వకుండా తన వ్యక్తిత్వంలో భాగంగా ఫీల్ అయింది. గతంలో వాటన్నిటినీ తన తొలగించాలి అనుకుంది కానీ తర్వాత కాలంలో అదే బలంగా మార్చుకుంది.

కాలేజీ అందరి ముందు అలా నిలుచుని ఫియర్లెస్ ఆటిట్యూడ్ చూపించడానికి మాత్రమే దానిని వాడాను అంటూ రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. నీకు లేని సిగ్గు నాకెందుకురా ఎదవ అనే డైలాగ్ కూడా అందుకే చెప్పించాను. నన్ను అవమానించడానికి వేసిన పెయింటింగ్ నాకు మాత్రమే కాదు నీకు కూడా సిగ్గు అనేలా కన్వె చేయడమే అంటూ క్లారిటీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్.

No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9

అర్జున్ రెడ్డి పోలికపై రాహుల్ రవీంద్రన్ స్పష్టత

— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025

మరోవైపు కొన్ని సినిమాలకు థియేటర్లో ఊహించిన రెస్పాన్స్ రాకపోయినా కూడా ఓటీటీలో రెస్పాన్స్ రావడం సహజంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి కేవలం థియేటర్లోనే కాకుండా ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది థియేటర్లో చూసిన వాళ్లు కూడా ఓటీటీ లో చూస్తూ రాహుల్ రవీంద్రన్ ప్రశంసిస్తున్నారు.

మొత్తంగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా క్లైమాక్స్ లో అర్జున్ రెడ్డి సినిమా పోలికలపై రాహుల్ రవీంద్రన్ స్పష్టతనిచ్చారు. హీరోయిన్ ఫియర్లెస్ ఆటిట్యూడ్ చూపించడానికే ఆ సన్నివేశాన్ని వాడినట్లు వివరించి, సోషల్ మీడియా ప్రశ్నలకు ముగింపు పలికారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.