
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ అమ్మాయి చున్నీ తీసి ఎమోషనల్ అవ్వడంతో అది వైరల్ అయ్యి, భారీ ట్రోలింగ్‌కు దారితీసింది. దీనిపై రాహుల్ రవీంద్రన్ సంచలన పోస్ట్‌తో స్పందించారు.
Key Points
'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రమోషన్స్‌లో భాగంగా థియేటర్‌కు వెళ్లిన రాహుల్ రవీంద్రన్.
రష్మిక గెటప్‌లో వచ్చిన అమ్మాయి చున్నీ తీయగా వీడియో వైరల్.
నెటిజన్ల నుండి ట్రోలింగ్, మహిళా సాధికారతపై ప్రశ్నలు.
రాహుల్ రవీంద్రన్ సంచలన పోస్ట్, అమ్మాయికి మద్దతు, ద్వంద్వ ప్రమాణాలపై విమర్శ.
చున్నీ తీసిన ఘటనపై నెటిజన్ల ట్రోలింగ్
రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)ప్రమోషన్స్‌లో భాగంగా స్వయంగా థియేటర్స్‌కు వెళ్లి ప్రేక్షకుల రివ్యూలు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే.. ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. ఓ థియేటర్‌లో సినిమా మొత్తం అయిపోయాక ఓ అమ్మాయి తన దగ్గరకు వచ్చి రష్మిక గెటప్‌లో వచ్చానని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అలాగే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అని చున్నీ తీసేస్తుంది. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ మొదలెట్టారు. చున్నీ తీయడం ఉమెన్ ఎంపావర్‌మెంట్ అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్ సంచలన పోస్ట్
అలాగే అది మహిళల భద్రతకు చిహ్నం ఎలా అవుతుంది దాన్ని తీసేయడాన్ని డైరెక్టర్ ప్రశంసించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్స్ రోజు రోజుకు పెరుగుతుండటంతో రాహుల్ రవీంద్రన్ స్పందించారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘నేను అసలు ఈ సంఘటన గురించి స్పందించకూడదనుకున్నాను. కానీ ఆరోపణలు ఎక్కువగా వస్తుండటంతో పాటు ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి స్పందించాల్సి వచ్చింది. థియేటర్‌లో జరిగిన సంఘటన పూర్తిగా యదృచ్ఛికం. అది పీఆర్ స్టంట్ కాదు. రెండు థియేటర్లలో మధ్య గందరగోళంగా ఉండగా.. అనుకోకుండా ఆ షోకు వెళ్లాం. ఆ అమ్మాయిని కూడా మొదటిసారి కలిశాం. ఇలా ట్రోల్ చేస్తారనే వీడియో పెట్టడానికి కాసంత భయపడ్డాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం ఎవరినీ వారి చున్నీలను తీయమని అడగడం లేదు.
సంస్కృతి, మహిళల భద్రతపై ప్రశ్నలు
ఇది పూర్తిగా వ్యక్తిగతమే. సినిమాలో చున్నీ రూపకంగా మాత్రమే ఉపయోగించారు. సినిమా థియటర్స్‌కు వెళ్లినప్పుడు, పండుగల్లో, క్రీడా వేడుకల్లో ఆనందంతో అబ్బాయిలు చొక్కాలు చించుకున్నా ఎవరూ ప్రశ్నించరు. కానీ మహిళలు చున్నీ తొలగిస్తే సంస్కృతి పేరుతో విమర్శలు చేస్తున్నారు. మన సంస్కృతిని కాపాడుకునే భారాన్ని అమ్మాయిల భుజాలపై వేస్తున్నారు. మహిళలను దోషులుగా ఎందుకు చూస్తున్నారు సంస్కృతిని కాపాడుకోవడంలో పురుషులు శ్రద్ధ వహిస్తామని చెప్తారు కదా మరి ఏదైనా ఇంగ్లీష్‌లో ఎందుకు పోస్ట్ పెడతారు’’ అని రాసుకొచ్చాడు.
రాహుల్ రవీంద్రన్ పోస్ట్ సమాజంలో మహిళల స్వేచ్ఛ, సంస్కృతిపై ఉన్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించింది. ఈ వివాదం మహిళల భద్రత, ట్రోలింగ్‌పై లోతైన చర్చకు దారితీసింది, ఆలోచింపజేసే అంశాలను వెలుగులోకి తెచ్చింది.


