
స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి హరిణ్య రెడ్డితో నవంబర్ 27న ఆయన వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా, ఆయన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
Key Points
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్య రెడ్డిని నవంబర్ 27న వివాహం చేసుకోనున్నారు.
ఇటీవల ఆగస్టులో హరిణ్య రెడ్డితో రాహుల్ నిశ్చితార్థం జరిగింది.
రాహుల్, హరిణ్య దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని తమ పెళ్ళికి ఆహ్వానించారు.
నాటు నాటు పాటతో ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేసి రాహుల్ స్టార్ సింగర్‌గా ఎదిగారు.
రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం ఎప్పుడు?
Rahul Sipligunj : ప్రైవేట్ ఆల్బమ్స్ తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యాడు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టు లో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు.(Rahul Sipligunj)
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం
రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్టు సమాచారం.
రాహుల్ సిప్లిగంజ్ సినీ ప్రస్థానం
ఇటీవలే కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల భారీ నజరానా ప్రకటించి అందచేశారు.
రాహుల్ సిప్లిగంజ్ వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం ఆ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. ఈ స్టార్ సింగర్ కొత్త జీవితం సంతోషంగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.


