|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raj Kundra: ‘నా కిడ్నీల్లో ఒకటి మీదే’.. హీరోయిన్ భర్త ఆఫర్!

Published: 15-08-2025, 3:18 AM

బాలీవుడ్ నటుడు రాజ్ కుంద్రా తన కిడ్నీని ప్రేమానంద్ మహారాజ్ కి దానం చేస్తానని ప్రకటించారు. రూ. 60 కోట్ల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.

Key Points

1

రాజ్ కుంద్రా ప్రేమానంద్ మహారాజ్ కిడ్నీ దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

2

రూ.60 కోట్ల మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

4

ప్రేమానంద్ మహారాజ్ గత పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.

కిడ్నీ దాన ప్రతిజ్ఞ

బాలీవుడ్ ‌ లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే . ఆ కపుల్ ‌ మరెవరో కాదు .. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రా . గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా .. మరో కేసులో చిక్కుకున్నారు . తనను రూ .60 కోట్ల మోసం చేశారంటూ రాజ్ ‌ కుంద్రా , శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు . దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు . ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ ‌ మహారాజ్ ‌ కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు . ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు . ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్ ‌ ఛానెల్ ‌ లో పోస్ట్ చేశారు . ఈ సందర్భంగా రాజ్ ‌ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు . మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ ‌ గా మారింది . వ్యాపారవేత్తను రూ . 60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం .

రూ.60 కోట్ల మోసం ఆరోపణలు

రాజ్ కుంద్రా మాట్లాడుతూ .. ‘ నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు , భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి . ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు . అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే.” అని అన్నారు .

ఆశ్రమ సందర్శన

అయితే ప్రేమానంద్ మహారాజ్‌కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రాజ్ కుంద్రా యొక్క ఈ అనూహ్య నిర్ణయం సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. ఆయన మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తున్నవారున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.