|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్: ప్రభాస్ మూవీకి మైండ్ బ్లోయింగ్ ధ‌ర! ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Published: 12-01-2026, 7:00 AM
రాజాసాబ్: ప్రభాస్ మూవీకి మైండ్ బ్లోయింగ్ ధ‌ర! ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
  • రాజాసాబ్‌కు జియో హాట్ స్టార్‌లో రికార్డ్ ధ‌ర ప‌లికిన ఓటీటీ హ‌క్కులు – రూ. 160 కోట్లు!
  • ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది!
  • తొలి రోజు రాజాసాబ్ రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.
  • రిద్ది కుమార్, నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్ వంటి స్టార్ హీరోయిన్లు రాజాసాబ్‌లో!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాజాసాబ్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు జియో హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఫిబ్ర‌వ‌రిలో స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం.

జియో హాట్ స్టార్‌లో రాజాసాబ్ స్ట్రీమింగ్

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. అయితే, ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, క‌లెక్ష‌న్స్ వ‌స్తోన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే, ఈ సినిమాకు మొద‌టి రోజున రూ.100కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక మూడో రోజున ది రాజాసాబ్ సినిమా రూ.183 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో అద‌నంగా సీన్లు యాడ్ చేయ‌డంతో ఈ సినిమాకు క‌లెక్ష‌న్స్ వ‌స్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

రికార్డ్ ధ‌ర ప‌లికిన ఓటీటీ హ‌క్కులు

ది రాజాసాబ్ ఓటీటీ అప్డేట్

ఫిబ్ర‌వ‌రిలో రాజాసాబ్ ఓటీటీ రిలీజ్!

ప్ర‌భాస్ న‌టించిన ది రాజాసాబ్ సినిమా ఓటీటీ అప్డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఏకంగా రూ.160 కోట్లకు ఈ సినిమాను జియో హాట్ స్టార్ కొనుగోలు చేసింద‌ట‌. ఇక ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంద‌ట‌. ప్ర‌భాస్ న‌టించిన ది రాజాసాబ్ సినిమాలో రిద్ది కుమార్, నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. రాజాసాబ్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.