
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రెండో ట్రైలర్ విడుదలైంది.
- సినిమాపై దర్శకుడు మారుతిని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
- సినిమా తనే తీశానని మారుతి గట్టి కౌంటర్ ఇచ్చారు.
- ప్రభాస్, తమన్, నిర్మాత విశ్వప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రెండో ట్రైలర్ విడుదలయ్యాక, ఓ నెటిజన్ దర్శకుడు మారుతిపై సందేహం వ్యక్తం చేశారు. దీనికి మారుతి గట్టి సమాధానం ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
రాజాసాబ్ పై నెటిజన్ సందేహం
ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేయగా మారుతి దర్శకత్వం వహించారు. కామెడీ, హారర్ నేపద్యంలో ఈ సినిమా రానుంది. అయితే, సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండో ట్రైలర్ రిలీజ్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది చిత్రం బృందం. ఈ మూవీ రెండో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ 2.0పై ఓ నెటిజన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ మూవీస్ నిజంగానా మారుతీ తీశారా? నమ్మలేకపోతున్నాం అంటూ పేర్కొన్నాడు. అయితే ఆ నెటిజెన్ చేసిన పోస్టుకు దర్శకుడు మారుతి రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా తీసింది నేనే బ్రదర్.. మీ అందరికీ డిఫరెంట్ స్టోరీ అందించేందుకు, చాలా కష్టపడ్డాను అంటూ వెల్లడించారు. తనపై నమ్మకం గురించి అవకాశం ఇచ్చిన ప్రభాస్ కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. తమన్, నిర్మాత విశ్వప్రసాద్ సహకారం ఈ ప్రాజెక్టును ఓ రేంజ్ కు తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో మారుతి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
మారుతి స్ట్రాంగ్ రిప్లై
దర్శకుడి పోస్ట్ వైరల్
దర్శకుడు మారుతి ఇచ్చిన ఈ కౌంటర్ ‘ది రాజా సాబ్’ పై వచ్చిన సందేహాలను నివృత్తి చేసింది. తన కష్టాన్ని, చిత్ర బృందం సహకారాన్ని వెల్లడిస్తూ మారుతి చేసిన పోస్ట్ సినిమాపై అంచనాలను పెంచింది.


