|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ `రాజా సాబ్‌` ఫ్లాప్! రాజమౌళి సెంటిమెంటే కారణమా? వైరల్ టాక్!

Updated: 21-01-2026, 10:09 PM
షాకింగ్: ప్రభాస్ `రాజా సాబ్‌` ఫ్లాప్! రాజమౌళి సెంటిమెంటే కారణమా? వైరల్ టాక్!
  • ప్రభాస్ `ది రాజా సాబ్‌` కలెక్షన్లు డౌన్! 500 కోట్ల టార్గెట్ కాస్తా 200 కోట్ల దగ్గరే ఆగిపోయింది!
  • `బాహుబలి ది ఎపిక్` విడుదల తర్వాత వచ్చిన `ది రాజా సాబ్‌` మూవీకి రాజమౌళి సెంటిమెంట్ అడ్డు?
  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని విశ్లేషణలు
  • రాజమౌళితో సినిమా చేస్తే హిట్టే కానీ.. ఆ తర్వాత హీరోల పరిస్థితి అటు ఇటుగా ఉంటుందని టాక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్ అవ్వడం అభిమానులను కలవరానికి గురిచేసింది. ఈ మూవీ వెనుక ఉన్న షాకింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్.

`ది రాజా సాబ్‌` ఫ్లాప్: అసలు కారణాలివేనా?

పాన్‌ ఇండియా స్టార్‌, మన డార్లింగ్‌ ప్రభాస్‌ రీసెంట్‌గా `ది రాజా సాబ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం దిశగా వెళ్తోంది.  బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. దాదాపు ఐదువందల కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సిన ఈ మూవీ రెండు వందల కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కలెక్షన్లు భారీగా తగ్గాయి. రోజుకు కోటి కూడా రాబట్టలేకపోతుంది. ఓవరాల్‌గా అయితే ఈ మూవీ డిజాస్టర్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌ కి కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఆడియెన్స్, అభిమానులు, మీడియా చెప్పే మాట ఏంటంటే ప్రభాస్‌ దెయ్యంని చూసి భయపడటం అనేదానికి ఆడియెన్స్‌ కనెక్ట్ కావడం లేదు. పైగా సినిమా స్లో ఉంది. సరైన ఎమోషన్స్ లేవు. సినిమా నేచురల్‌గా లేదు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు అంటున్నారు. ఫన్‌ వర్కౌట్‌ అయితే సినిమా ఆడేది. కానీ అది ఆశించిన స్థాయిలో లేదు. అందుకే ఆడియెన్స్ పెదవి విరిచారనేది అందరి నుంచి వినిపించే మాట.

రాజమౌళి సెంటిమెంట్ నిజంగానే పనిచేసిందా?

కానీ `ది రాజా సాబ్‌` మూవీ పరాజయానికి మరో కారణం చెబుతున్నారు ట్రోలర్స్. దర్శకధీరుడు రాజమౌళినే కారణం అంటున్నారు. మరి ఈ సినిమాకి, జక్కన్నకి లింకేంటి అనేది చూస్తే, క్రేజీ కారణం చెబుతున్నారు. సాధారణంగా రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే, ఆ మూవీ పెద్ద హిట్‌ అవుతుంది. కానీ ఆ తర్వాత ఆ హీరో చేసిన సినిమాలు పరాజయం చెందుతాయి. ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో విఫలమవుతాయని, అందుకే పరాజయం చెందుతాయని అంటుంటారు. ఇదొక సెంటిమెంట్‌గా చెబుతుంటారు. రాజమౌళి తో సినిమాలు చేసిన ప్రతి హీరోకి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

అదే కారణం `ది రాజా సాబ్‌`కి ముడిపెడుతున్నారు. మరి రాజమౌళితో ప్రభాస్‌ ఇప్పుడు సినిమా ఏం చేయలేదు. మరి ఈ సెంటిమెంట్‌ ఎలా పని చేసిందనేది అందరికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. దానికి ట్రోలర్స్ చెప్పిన కారణం మాత్రం క్రేజీగా ఉంది. `ది రాజా సాబ్‌` మూవీ విడుదలకు ముందు రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలి ది ఎపిక్‌` రిలీజ్‌ అయ్యింది. రెండు బాహుబలి సినిమాలను ఒక్కటి చేసి `బాహుబలి ది ఎపిక్‌` గా రిలీజ్‌ చేశారు. అక్టోబర్‌లోనే ఈ మూవీ విడుదలయ్యింది. దానికి మంచి స్పందన లభించింది. యాభై కోట్లకుపైగా కలెక్షన్లు కూడా వచ్చాయి. దీంతో `బాహుబలి ది ఎపిక్‌` తర్వాత `ది రాజా సాబ్‌` మూవీ విడుదలయ్యింది. రాజమౌళి సెంటిమెంట్‌ పనిచేసింది. దాని వల్లే ప్రభాస్‌ మూవీ పరాజయం చెందింది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇది చూసి అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ దానికి మించిన క్రేజీ కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫ్యాన్స్ ఆశలు!

ఏదేమైనా `ది రాజా సాబ్‌` భారీ డిజాస్టర్‌గా నిలవబోతుంది. ఇది రూ.80-90కోట్ల వరకు నష్టాలను తీసుకురాబోతుందట. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్ ముఖ్య పాత్ర పోషించారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన విషయం తెలిసిందే.

`ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్ వెనుక అసలు కారణాలు తెలుసుకున్నాం కదా. ప్రభాస్ తదుపరి చిత్రాల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అప్పటివరకు సెలవు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.