|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్‌లో మొసళ్ళ షాక్!

Published: 08-01-2026, 1:00 PM
రాజా సాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్‌లో మొసళ్ళ షాక్!
  • ది రాజా సాబ్ ప్రీమియర్లు ఓవర్ సీస్, ఏపీలో ప్రారంభమయ్యాయి.
  • తెలంగాణలో పర్మిషన్లు రాకపోవడంతో ప్రీమియర్లు వాయిదా పడ్డాయి.
  • ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్‌లోకి ప్లాస్టిక్ మొసళ్లను తెచ్చి హంగామా సృష్టించారు.
  • సినిమా ప్రారంభంలో హారర్ అంశాలు, ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ, ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయట.

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ప్రీమియర్లు ఓవర్ సీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ఓ హంగామా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్లాస్టిక్ మొసళ్లతో థియేటర్‌లో రచ్చ చేయడంతో నెటిజన్ల నుండి భిన్న రకాల కామెంట్స్ వస్తున్నాయి.

ది రాజా సాబ్ ప్రీమియర్లు: అంచనాలు, స్పందనలు

ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. ఓవర్ సీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్లు ప్రారంభం కాగా తెలంగాణలో మాత్రం పర్మిషన్లు రాలేదు. దీంతో ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు తెలంగాణలో పడలేదు. కేవలం మీడియా వాళ్లకు మాత్రమే బాలానగర్ విమల్ థియేటర్ లో వేసినట్లు సమాచారం.

థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ అరాచకం: మొసళ్ళ హంగామా

అయితే ప్రీమియర్లు పడ్డచోట ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై ప్రభాస్ ను చూసుకున్న ఫ్యాన్స్ రచ్చ ర‌చ్చ‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఓ థియేటర్ లోకి ప్లాస్టిక్ మొసళ్లను కూడా తీసుకువచ్చారు. పెద్ద సైజులో ఉన్న ఈ మొసళ్లను తీసుకువచ్చి థియేటర్ లో చిందులు వేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్‌ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు మెంటల్ రెబల్స్ అంటూ ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు.

సినిమాలోని కీలక అంశాలు: ఫస్ట్ రివ్యూ

కాసేపటి క్రితమే ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. సినిమాపై ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రారంభంలోనే హారర్ అంశాలు కనిపిస్తాయట. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ రాగానే రెబల్ సాబ్ అనే సాంగ్ వస్తుందట. ఆ తర్వాత ముగ్గురు హీరోయిన్లు పరిచయం అవుతార‌ట‌. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, మాళవిక మధ్య కొన్ని ఫన్నీ మూమెంట్స్ తర్వాత కథ సీరియస్ లోకి వెళ్తుందని పోస్టులు పెడుతున్నారు. క్లిక్

ది రాజా సాబ్ ప్రీమియర్లు, ఫ్యాన్స్ రచ్చ వార్తలతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, ఈ సంఘటన సినిమా విడుదలకు ముందు మరిన్ని అంచనాలను పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.