
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్-కామెడీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ వార్త ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
Key Points
'రాజా సాబ్' సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
ప్రభాస్ కెరీర్‌లో తొలిసారిగా హారర్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మారుతి దర్శకత్వంలో రూ.500 కోట్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
రాజా సాబ్ ట్రైలర్ సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది.
ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాపై అంచనాలు
Raja Saab Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఏదైనా ఉందంటే అది రాజా సాబ్ అనే చెప్పాలి. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి రాజా సాబ్ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంచనాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, కెరీర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ బ్యాక్డ్రాప్(Raja Saab Trailer) లో సినిమా చేస్తున్నాడు. ఇక హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో హిట్ కొట్టడంలో మారుతీ బెస్ట్. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Upasana: ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు.. ముఖ్యమంత్రితో ఆడిపాడిన మెగా కోడలు
ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన
ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూ.500 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇక తాజాగా దసరా పండుగ సందర్బంగా రాజా సాబ్ టీం ఫ్యాన్స్ కి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజా సాబ్ ట్రయిలర్ విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.
సినిమా హైలైట్స్, విడుదల వివరాలు
ఇక ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. మరి కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ అండ్ కామెడీ జానర్ సినిమా చేస్తున్న ప్రభాస్ కి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.
మొత్తానికి, కెరీర్‌లో తొలిసారి హారర్ జానర్‌లో నటిస్తున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా వచ్చిన ఈ ట్రైలర్ అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ట్రైలర్ వచ్చాక సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వస్తుంది.


