
జూనియర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి పాల్గొని, తన కెరీర్ లోని ఉత్తమ చిత్రంగా ‘ఈగ’ ను ప్రస్తావించారు. ‘సింహాద్రి’ తర్వాత ఈ ప్రయోగాత్మక చిత్రం తనకు ఎలాంటి అనుభవాన్నిచ్చిందో వివరించారు.
Key Points
రాజమౌళి 'ఈగ' సినిమాను తన కెరీర్ లోని ఉత్తమ చిత్రంగా పేర్కొన్నారు.
'సింహాద్రి' తర్వాత 'ఈగ' లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసిన విషయాన్ని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.
జూనియర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి పాల్గొన్నారు.
రాజమౌళి 'ఈగ' సినిమాను యువతకు నచ్చేలా రూపొందించిన ప్రయోగాత్మక చిత్రంగా వివరించారు.
జూనియర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం జూనియర్. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్రలో నటిస్తూ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో జూనియర్ చిత్రం రూపొందింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూలై 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో సుమ తనదైన ప్రశ్నలతో జక్కన్నని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.
రాజమౌళి కెరీర్ లో ఉత్తమ చిత్రం ‘ఈగ’
రాజమౌళి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిని చూడగానే ఏమనిపిస్తుందో చెప్పాలని రాజమౌళిని అడిగారు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఫోటోని చూపించారు. దాని గురించి రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా స్టూడెంట్ నెంబర్ 1 టైం లో తీసుకున్న ఫోటోని క్రియేట్ చేశామని రాజమౌళి గుర్తు చేస్తున్నారు.
ఆ తర్వాత ఈగ మూవీ షూటింగ్ ఫోటో చూపించారు. నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఈ చిత్రంలో నాని, సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. కిచ్చా సుదీప్ విలన్ గా నటించారు. ఈగని రాజమౌళి ఒక సూపర్ హీరోలా ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం.
‘సింహాద్రి’ తర్వాత ‘ఈగ’ ప్రయోగం
ఆ తర్వాత సై షూటింగ్ లో కమెడియన్ వేణుమాధవ్ తో రాజమౌళి ఉన్న ఫోటోని చూపించారు. ఆ ఫోటో చూడగానే రాజమౌళి నవ్వేశారు.నా కెరీర్ లో సై ఒక స్పెషల్ మూవీ. సింహాద్రి లాంటి మాస్ మూవీ తర్వాత చేసిన చిత్రం. వరుసగా మాస్ సినిమాలే చేయాల్సిన అవసరం లేదు.. రగ్బీ లాంటి కొత్త క్రీడను పెట్టి యువతకి నచ్చేలా తెరకెక్కించిన చిత్రం అది. దర్శకుడిగా నేను చేసిన ఈ ప్రయోగం నా కెరీర్ కి బాగా ఉపయోగపడింది. మాస్ సినిమాలే కాకుండా మనకి నచ్చిన కథలతో సినిమాలు చేయొచ్చు అని ఈ చిత్రం ద్వారా తనకు తెలిసినట్లు రాజమౌళి తెలిపారు.
రాజమౌళి ‘ఈగ’ చిత్రం ద్వారా మాస్ సినిమాలతో పాటు విభిన్నమైన కథలతో సినిమాలు చేయవచ్చని నిరూపించారు. ఈ ప్రయోగం ఆయన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.


