
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా రెండోసారి తల్లి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో వల్ల ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఇలియానా నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Key Points
టాలీవుడ్ నటి ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇలియానా తన భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డను పెంచుతోంది.
ఈ విషయాన్ని ఇలియానా అధికారికంగా ధృవీకరించలేదు.
ఫాదర్స్ డే సందర్భంగా కుటుంబ ఫోటోను పోస్ట్ చేసింది.
ఇలియానా రెండో బిడ్డ
తెలుగులో ‘పోకిరి’ లాంటి హిట్ సినిమాతో ఫేమ్ సంపాదించిన ఇలియానా.. తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఫ్లాప్స్ పడటంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. నటనని పూర్తిగా పక్కనబెట్టేసిన ఈమె..ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.
ముంబైకి చెందిన ఇలియానా.. ‘దేవదాసు’ మూవీతో హీరోయిన్‌గా మారింది. అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో పలు మూవీస్ చేసింది. టాలీవుడ్‌లో ఈమెకు అప్పట్లో జీరో సైజ్ బ్యూటీ అనే క్రేజ్ ఉండేది. అలా పోకిరి, శక్తి, మున్నా, జల్సా, జులాయి తదితర సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ హిట్స్ కంటే ఈమెని ఫ్లాప్స్ ఎక్కువ వరించాయి. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఘోరంగా ఫెయిల్ అవడంతో పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైంది.
ఫాదర్స్ డే పోస్ట్
చివరగా గతేడాది ‘దో ఔర్ దో ప్యార్’ అనే హిందీ సినిమాలో కనిపించింది. అంతకు ముందే అంటే 2023లోనే మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. గతేడాది అక్టోబరులో తాను రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఇలియానా.. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. బెస్ట్ డాడీ అని చెప్పుకొచ్చింది.
అధికారిక ప్రకటన లేదు
ఈ క్రమంలోనే ఇలియానా మరో బిడ్డకు జన్మనిచ్చిందని అంటున్నారు. అయితే ఆమె వైపు నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సోషల్ మీడియాకు ఇలియానా దురంగా ఉంటూనే వస్తోంది. ఇప్పుడు కూడా రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేయట్లేదు. త్వరలో మంచి రోజు చూసి చెబుతుందేమో?
ఇలియానా రెండో బిడ్డ పుట్టిన విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.


