📌 Key Points
- అవతార్ 3 సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్.
- జేమ్స్ కామెరూన్, రాజమౌళి మధ్య అవతార్ సినిమాపై ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ.
- రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను ప్రశంసించిన జేమ్స్ కామెరూన్.
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అవతార్ 3 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, ఇండియాలో ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్తూ, దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన దర్శకధీరుడు రాజమౌళితో ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సంభాషణ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అవతార్ 3: ఇండియాలో గ్రాండ్ రిలీజ్
Rajamouli : హాలీవుడ్ ఫేమస్ ఫిలిం సిరీస్ అవతార్ నుంచి మూడో సినిమా రాబోతుంది. అవతార్, అవతార్ 2 సినిమాలతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు మూడో భాగంతో రాబోతున్నాడు. ఇండియాలో కూడా అవతార్ సినిమాలకు మంచి మార్కెట్, ఫాలోయింగ్ ఉంది. దీంతో అవతార్ 3 సినిమాని ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.(Rajamouli)
అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ ఆష్ సినిమా డిసెంబర్ 19 న రిలీజ్ కానుంది. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో ఇండియాలో కూడా కొంత ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమాకు. ఈ క్రమంలో జేమ్స్ కామెరాన్ మన దర్శకధీరుడు రాజమౌళితో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
రాజమౌళి, కామెరూన్ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు
హాలీవుడ్ లో జేమ్స్ కామెరాన్ కూర్చొని ఇక్కడ రాజమౌళితో వీడియో ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, జామ్ కామెరాన్ అనేక ఆసక్తికర విషయాలు అవతార్ సినిమా గురించి మాట్లాడారు. అవతార్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో పిల్లవాడిలా చూస్తుండిపోయాను అని రాజమౌళి అన్నారు. హైదరాబాద్ ఐమాక్స్ లో అవతార్ సినిమా ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి జేమ్స్ కామెరాన్ కి తెలిపారు. అలాగే అవతార్ ఫ్రాంచైజీ అద్భుతమైన బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్‌మార్క్‌గా ఉంటుందని రాజమోళి అన్నారు.
కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను అభినందించి, ఇండియన్ ఫిల్మ్ సెట్‌ను సందర్శించాలని ఉందని తెలిపారు. దీంతో రాజమౌళితో జేమ్స్ కామెరాన్ చేసిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.
గ్లోబల్ దర్శకుల ఆసక్తికర సంభాషణ
మీరు కూడా రాజమౌళితో జేమ్స్ కామెరాన్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
రాజమౌళి, జేమ్స్ కామెరూన్ ఇంటర్వ్యూ సినీ ప్రియులకు ఓ గొప్ప విందు. అవతార్ 3 సినిమాపై అంచనాలను పెంచుతూ, ఇద్దరు గ్లోబల్ విజనరీల ఆలోచనలు, వారి సినీ ప్రస్థానంపై ఈ ఇంటర్వ్యూ మరింత స్పష్టతను ఇచ్చింది.

