
📌 Key Points
- రాజమౌళి తొలి సినిమా ఎన్టీఆర్ తోనే.. స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్!
- యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఎన్టీఆర్ స్థాయిని పెంచిన రాజమౌళి.
- మహేష్ బాబుతో 1500 కోట్ల సినిమాకు ప్లాన్ చేస్తున్న జక్కన్న.
- ఎన్టీఆర్ నటన, డెడికేషన్‌ను మెచ్చుకున్న రాజమౌళి.. అద్భుతమైన నటుడని కితాబు.
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఒక సంచలన వార్త! ఎన్టీఆర్ గురించి రాజమౌళి చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉండేది. అయితే బాలీవుడ్.. సౌత్ నుంచి కోలీవుడ్ తప్పించి.. ఇతన ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అటు వంటి పరిస్థితులను మార్చి.. టాలీవుడ్ రేంజ్ ను పాన్ఇండియా బ్రాండ్ గా మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు హీరోలను ఇండియాన్ స్టార్ హీరోలుగా ప్రమోషన్ ఇప్పించి.. మన టాలెంట్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు జక్కన్న.
తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను పాన్ ఇండియా హీరోలుగా చేసిన ఘనత రాజమౌళిది. ప్రస్తుతం మహేష్ బాబుతో 1500 కోట్ల సినిమాను తెరకెక్కిస్తూ.. హాలీవుడ్ పై కన్నేశాడు రాజమౌళి. ఎంత ఎత్తుకు ఎదిగినా.. రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గానే కనిపిస్తారు. పెద్దగా ఆర్భాటాలు, హడావిడి అతనికి ఇష్టం ఉండదు.
ఏ హీరోతో పనిచేసినా.. తనకు కావల్సిన అవుట్ ఫుట్ వచ్చేవరకు.. వారికి టార్చర్ తప్పదు జక్కన్న చేతిలో. ఈ హీరో ఎంటిరా బాబు నా కర్మకు దొరికాడు నాకు అని రాజమౌళి అనుకున్న సందర్భం ఏంటో తెలుసా? రాజమౌళి అలా అనుకుని.. ఆతరువాత అభిప్రాయం మార్చుకున్న హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో రాజమౌళి ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ తోనే.. జక్కన్న ఎక్కువ సినిమాలు చేసింది కూడా తారకే. సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన రాజమౌళి.. తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఆతరువాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసే అవకాశం వచ్చింది.
స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలైన జక్కన్న ప్రయాణం.
ఈ విషయం గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజమౌళి ఇలా అన్నాడు. ” అప్పుడు ఎన్టీఆర్ ను హీరోగా నా ముందు నిలబెట్టారు. అప్పుడు వచ్చీ రాని మీసాలు.. డింగ్ డింగ్ మనుకుంటూ.. నడక కూడా సరిగ్గా రాని వ్యక్తిని హీరోగా సినిమా చేయాలా..? వీడెక్కడ దొరికాడురా నాయన నా కర్మకు అని అనిపించింది.
కానీ మరో ఆలోచన ఏంటంటే.. ఇలా చేస్తేనే కదా మన టాలెంట్ బయలకు వచ్చేంది అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది రాంగ్ అని ఆతరువాత తెలిసింది. ఓ పది రోజులు తారక్ తో ట్రావెల్ చేసిన తరవాత.. అతని నటన, డెడికేషన్, ఆటీడ్యూడ్ అంతా నిజంగా అద్భుతం అనిపించింది. తారక్ లో మంచి నటుడు ఉన్నాడని.. నాకు ఆ పదిరోజుల్లో తెలిసింది. అని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు.
రాజమౌళి తరువాత బ్లాక్ బస్టర్ హిట్స్.
ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసిన జక్కన్న.. సూపర్ హిట్ కొట్టాడు. ఆతరువాత ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేసి.. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా మార్చాడు.. ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా బిజీలో ఉన్నాడు స్టార్ డైరెక్టర్. ఈసినిమాకు దాదాపు 1500 కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారన్న టాక్ ఉంది.
ఈలెక్కన్న ఈసినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో రావాలి.. ఏ రేంజ్ లో ఈసినిమా రిలీజ్ అవ్వాలి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న వారణాసి మూవీ.. 2027 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి.. ఈ దెబ్బతో రాజమౌళి హాలీవుడ్ కు వెళ్తారా..మహేష్ బాబు ఇమేజ్ ఎక్కడికి చేరుకుంటుంది అనేది.
రాజమౌళి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


