
📌 Key Points
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా.. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో చిత్రం!
- వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్న వారణాసి.. అంచనాలు భారీగా ఉన్నాయి.
- హాలీవుడ్‌లో రాజమౌళి ప్రమోషన్స్.. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో ఇంటర్వ్యూలు!
- సినిమా ఆలస్యంపై రాజమౌళి క్లారిటీ.. మహేష్‌తో సినిమా చేయడానికి కారణం ఇదే!
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి గల కారణం రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నాకు చెడ్డ పేరు ఉంది: రాజమౌళి
Rajamouli : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టార్గెట్ గా పెట్టుకొని దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పట్నుంచే హాలీవుడ్ వేదికగా రాజమౌళి ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు.(Rajamouli)
వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా రాజమౌళి హాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ రిలీజవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
మహేష్ తో లేట్ చేయడానికి కారణం అదే
ఈ క్రమంలో సినిమాలు లేట్ అవ్వడం అనే టాపిక్ రాగా రాజమౌళి స్పందించారు. రాజమౌళి మాట్లాడుతూ.. నాకు మా ఇండియాలో ఈ విషయంలో చాలా చెడ్డ పేరు ఉంది. నేను సినిమాలు లేట్ చేస్తానని, ప్రొడక్షన్ లేట్ గా చేస్తాను అని, సినిమాలు వాయిదా వేస్తాను అని నాకు చెడ్డ పేరు ఉంది. నన్ను అందరూ ఆ విషయంలో కామెంట్ చేస్తారు.
హాలీవుడ్‌లో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్
మహేష్ ని మొదట 2010లోనే కలిసాను. అప్పుడే అతనితో సినిమాలు చేయాలి. మహేష్ ని కలిసినప్పుడు నాకు నిర్మాతలతో మూడు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసి రావాలి. అందుకే లేట్ అయింది. ఈగ సినిమా నుంచి నా ప్రతి సినిమా రెండేళ్లు పైనే పట్టింది. అలా ఇయర్స్ పాస్ అయి ఇప్పటికి వర్కౌట్ అయింది మహేష్ తో అని తెలిపారు.
రాజమౌళి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


