|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పచ్చబొట్టు’ పాటతో పాటు ఆ సీన్లన్నీ డీలీట్‌ చేశాం : రాజమౌళి

Published: 29-10-2025, 12:46 PM
‘పచ్చబొట్టు’ పాటతో పాటు ఆ సీన్లన్నీ డీలీట్‌ చేశాం : రాజమౌళి

బాహుబలి పార్ట్ 1, 2 కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ గా రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాజమౌళి కీలక ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. ‘పచ్చబొట్టు’ పాటతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు, ఇది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

బాహుబలి పార్ట్ 1, 2 కలిపి 'బాహుబలి: ది ఎపిక్' గా అక్టోబర్ 31న రీరిలీజ్.

2

ఆరున్నర గంటల నిడివిని 3:45 గంటలకు కుదించారు.

4

ప్రభాస్-తమన్నాల అవంతిక ప్రేమ సన్నివేశాలు, కొన్ని యుద్ధ సీన్లు డిలీట్.

బాహుబలి: ది ఎపిక్ – రీరిలీజ్ వివరాలు

బాహుబలి పార్ట్ ‌1, పార్ట్ ‌ 2 కలిసి ‘ బాహుబలి: ది ఎపిక్‌’ ( Baahubali: The Epic) పేరుతో రీరిలీజ్ ‌ కాబోతున్న సంగతి తెలిసిందే . అక్టోబర్ ‌ 31 న ఈ చిత్రం థియేటర్స్ ‌ లో సందడి చేయబోతుంది . ఆరున్నర గంటల నిడివిని  3:45 గంటలకు కుదించి ‘ బాహుబలి: ది ఎపిక్‌’ని తీర్చిదిద్దారు . ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ‌ సోషల్ ‌ మీడియాలో బాగా వైరల్ ‌ అయింది . సినిమాలోని యాక్షన్స్ ‌ సీన్స్ ‌ అన్నింటిని కవర్ ‌ చేస్తూ ట్రైలర్ ‌ ని కట్ ‌ చేశారు .  అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే రన్‌టైమ్‌ 3.45 గంటలకు చేరింది.

ఓ సినిమాకు ఇంత రన్‌టైమ్‌ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్‌ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ని కూడా డిలీట్‌ చేసినట్లు రాజమౌళి చెప్పారు.

డిలీటెడ్ సీన్లు, పాటలపై రాజమౌళి వెల్లడి

తాజాగా ఆయన ప్రభాస్‌(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్‌ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు.

ప్రభాస్-తమన్నా ప్రేమ సన్నివేశాల తొలగింపు

ప్రభాస్ ‌- తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ ది ఎపిక్ ‌’ లో చూడలేమట . అవంతిక లవ్‌స్టోరీ మొత్తాన్ని డిలీట్ ‌ చేసినట్లు రాజమౌళి చెప్పారు . అంతేకాదు పచ్చబొట్టేసిన , ఇరుక్కుపో , కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు . యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు .  మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.  పార్ట్‌ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి.

‘బాహుబలి: ది ఎపిక్’ కోసం చేసిన ఈ మార్పులు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయాలు సినిమా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.