|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RajaSaab Trailer Review: రాజాసాబ్‌ ట్రైలర్‌ రివ్యూ.. భయపడుతూ, భయపెట్టిన ప్రభాస్‌, విజువల్స్ వండర్‌కి రెడీ అయిపోండి

Published: 29-09-2025, 11:23 AM
RajaSaab Trailer Review: రాజాసాబ్‌ ట్రైలర్‌ రివ్యూ.. భయపడుతూ, భయపెట్టిన ప్రభాస్‌, విజువల్స్ వండర్‌కి రెడీ అయిపోండి

ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` ట్రైలర్‌ విడుదలైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హర్రర్‌ ఫాంటసీ, విజువల్ వండర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ నటన, హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌ హైలైట్‌గా నిలిచాయి. జనవరి 9, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

`ది రాజా సాబ్‌` ట్రైలర్‌ విడుదలయ్యింది, ఇండియా వైడ్‌గా భారీ స్పందన.

2

ప్రభాస్‌ దెయ్యానికి భయపడటం, దెయ్యంగా మారి భయపెట్టడం ప్రధాన ఆకర్షణ.

4

చిత్రం జనవరి 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్రైలర్‌ హైలైట్స్‌: ప్రభాస్‌ విశ్వరూపం

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ `ది రాజా సాబ్‌`. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రమిది. హర్రర్‌ ఫాంటసీ విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మారుతి. తాజాగా సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలయ్యింది. భారీ స్థాయిలో ఇండియా వైడ్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ ని రిలీజ్‌ చేశారు.

హర్రర్‌ అంశాలు, విజువల్స్ వండర్స్, ప్రభాస్‌ భయపడుతూ, భయపెడుతూ సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్‌ చూపించే విశ్వరూపం వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. మొదట దెయ్యానికి భయపడ్డ ప్రభాస్‌ ఆ తర్వాత దెయ్యంతో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత తానే దెయ్యంగా మారిపోతాడు. ఆ రాజమహల్‌లో ఆయన రాజుల మారి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. వారిని ఆడుకుంటాడు. అంతేకాదు మధ్యలో హీరోయిన్లతో డ్యూయెట్లు, రొమాన్స్ కూడా చేస్తాడు. అదే సమయంలో కామెడీ చేస్తాడు. ఇలా ప్రభాస్‌ తనలోని అన్ని యాంగిల్స్ ని ఇందులో చూపించడం విశేషం. `ది రాజాసాబ్‌`తో వింటేజ్‌ ప్రభాస్‌ని చూడొచ్చు.

హాలీవుడ్ స్థాయి విజువల్స్

ఇక హర్రర్‌ ఎలిమెంట్లు వేరే స్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాటిని మించి ఇందులో ఉన్నాయి. ట్రైలర్‌ చూస్తుంటే హాలీవుడ్‌ మూవీ చూస్తున్నట్టుగానే ఉంది. చివరగా ఒక భారీ ఆకారాన్ని చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచాడు దర్శకుడు మారుతి. మొత్తంగా ది రాజా సాబ్‌ చిత్రంతో ఆయన ఇంకా ఏదో చేయబోతున్నాడని అర్థమవుతుంది. ముందు నుంచి సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, దాన్ని మించి ఉంటుందన్నారు. ట్రైలర్‌ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇండియన్‌ మూవీస్‌లో ఈ రేంజ్‌ విజువల్స్ చూడలేదని చెప్పొచ్చు.

`ది రాజా సాబ్‌` విడుదల తేదీ మార్పు

ఈ సందర్భంగా సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌. ఇప్పటికే ఈ చిత్రాన్ని చాలా సార్లు వాయిదా వేశారు. ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నారు. ఆ తర్వాత సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యింది. అట్నుంచి డిసెంబర్‌ 5న అని ప్రకటించారు. ఇప్పుడు మరో డేట్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని విడుదల చేయబోతున్నారు.

మొత్తంగా, `ది రాజా సాబ్‌` ట్రైలర్‌ అంచనాలకు మించి ఉందని చెప్పొచ్చు. ప్రభాస్‌ భయపెట్టే, భయపడే కొత్త అవతార్, విజువల్స్‌ అద్భుతం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. జనవరి 9, 2025న ఈ చిత్రం విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.