|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాజశేఖర్ కెరీర్‌ను మార్చేసిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు వదులుకున్న హీరో! మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్!

Published: 26-02-2026, 7:35 AM
షాకింగ్: రాజశేఖర్ కెరీర్‌ను మార్చేసిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు వదులుకున్న హీరో! మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్!
  • మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ మూవీ మొదట రాజశేఖర్‌కు వచ్చిందట.
  • దర్శకుడు శంకర్ ‘జెంటిల్మెన్’ మూవీలో నటించే అవకాశం రాజశేఖర్‌కు వచ్చి చేజారింది.
  • విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘చంటి’ మూవీని కూడా రాజశేఖర్ వదులుకున్నారు.
  • ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్ మళ్ళీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన రాజశేఖర్, కొన్ని సంచలన విజయాలను చేజార్చుకున్నారు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పగల మూడు సూపర్ హిట్ చిత్రాలను ఎందుకు వదులుకున్నారో తెలుసా?

రాజశేఖర్ మిస్ చేసుకున్న ‘ఠాగూర్’ మూవీ!

యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రాజశేఖర్‌. యాక్షన్‌ చిత్రాలతో మెప్పించి, ఆ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. రాజశేఖర్‌ మూవీస్ అంటే ఆవేశంతో కూడి ఉంటాయి. ఆయన కూడా అంతే ఆవేశానికి గురవుతూ నటించే వారు. అలా అయన్ని `యాంగ్రీ యంగ్ మేన్‌`గా పిలిచారు. అనంతరం రూట్‌ మార్చారు. కమర్షియల్‌ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే 1990-2010 వరకు రాజశేఖర్‌ కెరీర్‌ బాగానే ఉందని చెప్పొచ్చు. ఓ రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ని ఊపేసిన హీరోగా నిలిచారు. అయితే ఇటీవల ఆయన స్ట్రగుల్‌ అవుతున్నాడు. పది, పదిహేనేళ్లుగా హీరోగా సక్సెస్ కాలేకపోతున్నారు. `గరుడవేగ`తో హిట్‌ కొట్టినా, ఆ తర్వాత నిలబడలేకపోయారు. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాడు. హీరోగానూ రెండు సినిమాలతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ కెరీర్‌ని ఒకసారి చూస్తే, ఆయన పెద్ద మిస్టేక్స్‌ చేశారు. అందులోనూ మూడు సినిమాలను రిజెక్ట్ చేసి బిగ్‌ మిస్టేక్‌ చేశారని చెప్పొచ్చు.

‘జెంటిల్మెన్’ మూవీని వదులుకున్న రాజశేఖర్!

రాజశేఖర్‌ మిస్‌ చేసుకున్న మెయిన్‌ సినిమాల్లో `ఠాగూర్‌` ఒకటి. ఇది చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చింది. తమిళంలో వచ్చిన `రమణ` అనే చిత్రానికి రీమేక్‌. ఈ మూవీని తెలుగులో రాజశేఖర్‌ హీరోగా చేయాలనుకున్నారు, కానీ ఆ సమయంలో రీమేక్‌లపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో దీనికి నో చెప్పారు రాజశేఖర్‌. ఆ తర్వాత చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన ఓకే చెప్పారు. బాక్సాఫీసుని షేక్‌ చేశారు. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు. రాజశేఖర్‌ చేసి ఉంటే అది ఆయన్ని తిరుగులేని సూపర్‌ స్టార్‌ని చేసేదని చెప్పొచ్చు.

దీనిలాగానే మరో సంచలన మూవీకి నో చెప్పారు రాజశేఖర్‌. శంకర్ దర్శకత్వంలో రూపొందిన `జెంటిల్మెన్‌` మూవీ మొదట రాజశేఖర్‌ వద్దకే వచ్చింది. కానీ ఆయన చేయలేదు. ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో పెద్దగా ఆసక్తి చూపించలేదు. అనంతరం చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన కూడా నో చెప్పారు. చివరికి అర్జున్‌ వద్దకు వెళ్లింది. ఆయన సినిమా చేశారు. ఇది సంచలన విజయం సాధించింది. ఇదే రాజశేఖర్‌ చేసి ఉంటే ఇండస్ట్రీ షేక్‌ అయిపోయేది, హీరోగా ఆయన్ని మరో స్థాయికి తీసుకెళ్లేది.

‘చంటి’ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న యాంగ్రీ యంగ్ మేన్!

ఇలా రాజశేఖర్‌ వదులుకున్న మరో సంచలన మూవీ `చంటి`. వెంకటేష్‌ హీరోగా నటించిన చిత్రమిది. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీని కూడా రాజశేఖర్‌తోనే చేయాలనుకున్నారు. కానీ హీరో పాత్రని ఇలా ఇన్నోసెంట్‌గా చూపించడం తనకు నచ్చకపోవడంతో నో చెప్పారు రాజశేఖర్‌. దీన్ని వెంకటేష్‌ చేశారు. పెద్ద హిట్‌ని అందుకున్నారు. ఇది రాజశేఖర్‌ చేసి ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పొచ్చు. ఇలా రాజశేఖర్‌ తన కెరీర్‌లో చాలా సినిమాలకు నో చెప్పినా, ఈ మూడు చేసి ఉంటే ఆయన టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ అయ్యేవారని చెప్పొచ్చు. ఈ విషయంలో రాజశేఖర్‌ పెద్ద తప్పు చేశారు.

రాజశేఖర్ కెరీర్‌లో మిస్ చేసుకున్న ఈ మూడు సినిమాలు ఆయన స్థాయిని మార్చేసేవి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.