|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajendra Prasad: పవన్ కల్యాణ్‌తో సినిమా.. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Updated: 28-05-2025, 8:27 AM
Rajendra Prasad: పవన్ కల్యాణ్‌తో సినిమా.. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ ప్రమోషన్స్‌లో పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో తనకున్న అనుబంధం, సినిమాలో కలిసి నటించే అవకాశం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

రాజేంద్ర ప్రసాద్, పవన్ కల్యాణ్ తో సినిమా చేయకపోవడానికి కారణాలను వివరించారు.

2

పవన్ కల్యాణ్ రాజేంద్ర ప్రసాద్ ని తన అన్నయ్యలా భావిస్తారని తెలిపారు.

4

మంచి కథ, పాత్రలు దొరికితే త్వరలోనే ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ సినిమా ప్రమోషన్స్‌లో

సీనియర్ నటీనటులు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టిపూర్తి’. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. దీనికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మే 30న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇప్పటివరకు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో మీకు ప్రోపర్‌గా ఒక్క సినిమా కూడా పడేలేదు.. ఎందుకని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను అన్నయ్య కోసం మద్రాస్‌కు వెళ్తే నన్ను రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు పంపించేవారు. ఆయనేమో పొద్దుట నుంచి సాయంత్రం వరకు షూటింగ్ చూపించి సాయంత్రం నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. చిరంజీవి(Chiranjeevi)నే కాదు రాజేంద్ర ప్రసాద్ కూడా నాకు అన్నయ్య లాంటివారే అని కల్యాణ్ అన్నారు. మా ఇద్దరి మధ్యలో అంత చనువు ఉంది. నాకు పవన్ కల్యాణ్ బాగా సొంతం.. సొంత తమ్ముని కంటే ఎక్కువ. అంత బాగుంటాడు నా దగ్గర. కానీ ఎందుకనో మా ఇద్దరికి సరైనా క్యారెక్టర్ పడలేదు. నాకు తెలిసి త్వరలో పడుతుంది. తనకు నేను అంటే చాలా ఇష్టం. ఓ డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాస్తే మా ఇద్దరి సినిమా కచ్చితంగా వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కల్యాణ్‌తో సహకారంపై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, భవిష్యత్తు సినిమాలపై ఆశలు

రాజేంద్ర ప్రసాద్ మరియు పవన్ కల్యాణ్ కలిసి నటించే అవకాశం అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. తగిన కథ, పాత్రలు దొరికితే భవిష్యత్తులో ఈ జంట కలిసి తెరపై కనిపించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.