|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోలీవుడ్‌లో చరిత్ర సృష్టించబోతున్న రజనీ-కమల్: అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌కు పండగ!

Published: 03-01-2026, 2:30 AM
కోలీవుడ్‌లో చరిత్ర సృష్టించబోతున్న రజనీ-కమల్: అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌కు పండగ!
  • దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అధికారికంగా ఖరారైంది.
  • శిబి చక్రవర్తి దర్శకత్వంలో, అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
  • వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మితమవుతోంది.

దశాబ్దాలుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అధికారికంగా ఖరారైంది. ఈ ప్రకటనతో కోలీవుడ్‌లో చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగే.

రజనీ-కమల్ కాంబో ఫిక్స్.. అంచనాలు భారీగా!

స్టార్ హీరోలు రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan)కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నట్లు పలు పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ఇటీవల సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ వస్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న కమల్ హాసన్- రజనీకాంత్ కాంబో ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కోలీవుడ్ చరిత్రలోనే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఓ లెజెండరీ మూమెంట్ అని చెప్పొచ్చు.

ఈవిషయం తెలుసుకున్న సినీ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి కనిపించబోతుండటంతో ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో 173వ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్ఠాత్యకంగా తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. అయితే దీనికి శిబి చక్రవర్తికి దర్శకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం లభించిందని తెలిపారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు కూడా వెల్లడించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ప్రతి హీరోకు ఓ ఫ్యామిలీ ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రియులు కొందరు షాక్‌లో ఉండగా.. మరికొందరు పండగ చేసుకుంటున్నారు.

దర్శకత్వం, సంగీతం: ఎవరో తెలుసా?

విడుదల ఎప్పుడు? నిర్మాత ఎవరు?

రజనీకాంత్-కమల్ హాసన్ కాంబోతో రాబోతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.