
📌 Key Points
- రజనీకాంత్ 173వ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
- శివ కార్తికేయన్ ‘డాన్’ ఫేమ్ యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
- సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
- ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘థలైవర్ 173’పై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అధికారిక పోస్టర్‌ను విడుదల చేయగా, అనిరుధ్ సంగీతం, 2027 సంక్రాంతి విడుదల తేదీని ప్రకటించారు.
థలైవర్ 173: అధికారిక ప్రకటన
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా(Thalaivar 173) నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
official update on Rajinikanth Thalaivar 173 movie
Thalaivar 173: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ మూవీ బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా, యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రాజ్‌కమల్ ఫిల్మ్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కి ‘ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటారు’ అనే ట్యాగ్ లైన్ ని యాడ్ చేశారు. దీంతో, ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారింది.
యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తికి ఛాన్స్
Roshan Meka: రోషన్ హీరోగా స్పై థ్రిల్లర్ మూవీ.. హిట్ దర్శకుడు హిట్ ఇస్తాడా!
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా(Thalaivar 173)ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. దీంతో, రజినీకాంత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాజెక్టు దర్శకుడు సుందర్.సి తో మొదలయ్యింది.
సంగీతం, విడుదల తేదీ వివరాలు
కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో, రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం దర్శకుడు శిబి చక్రవర్తికి లభించింది. ఈ దర్శకుడు 2022లో శివ కార్తికేయన్ తో చేసిన డాన్ మూవీ మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
official update on Rajinikanth Thalaivar 173 movie
ఈ మెగా ప్రాజెక్ట్‌పై రజనీకాంత్, కమల్ హాసన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టాలెంట్‌తో రాబోతున్న ఈ సినిమా 2027 సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా మార్చడం ఖాయం. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.


