|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీ,నాగార్జున ఒకవైపు.. హృతిక్‌, ఎన్టీఆర్‌ మరోవైపు, ‘వార్‌’ తప్పదా?

Published: 08-05-2025, 6:19 AM
రజనీ,నాగార్జున ఒకవైపు.. హృతిక్‌, ఎన్టీఆర్‌ మరోవైపు, ‘వార్‌’ తప్పదా?

భారీ తారాగణంతో రూపొందిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. ఒకవైపు రజనీకాంత్, నాగార్జున నటించిన ‘కూలీ’, మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’. ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

Key Points

1

రజనీకాంత్ నటించిన 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది.

2

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కూడా అదే తేదీన విడుదల కానుంది.

4

రెండు సినిమాలకు వేర్వేరు జోనర్లు ఉన్నప్పటికీ, పోటీ తప్పదని అంచనాలు.

‘కూలీ’ విడుదల తేదీ

భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్‌తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు  నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది  కాదు. కానీ ఎప్పుడైతే సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో… అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.

‘వార్ 2’ విడుదల తేదీ

తమిళ టాప్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌  సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో  కూలీ(Coolie) పేరుతో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా చివరి దశకు వచ్చింది  ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్‌ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ ఆగస్ట్‌ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్‌ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.

బాక్స్ ఆఫీస్ పోటీ

మరోవైపు బాలీవుడ్‌ టాప్‌ హీరో హృతిక్‌ రోషన్, టాలీవుడ్‌ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్‌ 2(War 2)  కూడా అదే సమయంలో రిలీజ్‌ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్‌ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్‌ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో  వార్‌ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్‌ రాజ్‌ ఫిలింస్‌  రూపొందిస్తున్న  ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్‌. మేకర్స్‌ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా  ఇప్పటికే  ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్‌ తప్పదు. రెండు సినిమాల జోనర్‌ వేరువేరు..అయినప్పటికీ… ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్‌ 14న వస్తే, బాక్సాఫీస్‌ వద్ద సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్‌ హీరోలు   మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్‌ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్‌ టాపిక్స్‌ అవుతుంది  అంతేకాదు, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే అవకాశాలూ లేకపోలేదు.

రెండు సినిమాల విడుదల తేదీలు సమానం కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పనిసరి. సినిమా ప్రేమికులకు ఇది ఉత్కంఠగా ఉండబోతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.