
📌 Key Points
- ఆగస్టు 21న రజినీకాంత్ ‘జైలర్ 2’ విడుదల, అదే రోజు నాని ‘ది ప్యారడైజ్’ కూడా రిలీజ్!
- ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.
- రెండు సినిమాలకు అనిరుద్ సంగీతం అందిస్తుండటం విశేషం.. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు!
- కంటెంట్ మీద నమ్మకంతోనే రజినీకాంత్ సినిమాతో పోటీకి దిగుతున్న నాని.. ఇది సాహసమే మరి!
టాలీవుడ్ లో సంచలనం! సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతున్న రోజే నేచురల్ స్టార్ నాని తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అసలు నాని అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు? ఈ బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతుందో చూద్దాం!
రజినీకాంత్ vs నాని: బాక్సాఫీస్ వార్ షురూ!
Rajini- Nani: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాదు, మిగతా హీరోలు సైతం ఆ పోటీని తట్టుకోలేక వాయిదాలు వేసుకున్న సందర్భాలు కూడా చూసే ఉంటాం. కానీ, టాలీవుడ్ స్టార్ నాని మాత్రం అస్సలు తగ్గేదే అంటున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతున్న రోజే నాని సినిమాను కూడా విడుదల చేస్తున్నాడు. అసలు నాని ధైర్యం ఏంటి అనుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajini- Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. బ్లాక్ బస్టర్ జైలర్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వస్తోంది. దర్శకుడు నెల్సన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సీక్వెల్ కావడంతో జైలర్ 2పై ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.
ది ప్యారడైజ్: నాని నమ్మకం అదేనా?
కానీ, అదే రోజుల తన సినిమాను కూడా విడుదల చేస్తున్నట్టుగా తాజాగా అధికారిక ప్రకటన చేశాడు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాని లుక్స్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండనుందని మేకింగ్ వీడియోస్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి, ఈ సినిమా విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని ఫిక్స్ అయ్యారట మేకర్స్.
జైలర్ 2 దెబ్బకు నాని నిలబడతాడా?
కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఏకంగా రజినీకాంత్ సినిమాకు పోటీగా తన సినిమాను దించుతున్నాడట నాని. అంతేకాదు, ఆగస్టు 21 తరువాత వరుసగా సెలవులు కూడా ఉండటంతో ఆ డేట్ మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలకు కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి, సూపర్ స్టార్ vs నేచురల్ స్టార్ బాక్సాఫీస్ వార్ సిద్ధం అయినట్టే. మరి చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఆడియన్స్ పాజిటీవ్ రివ్యూస్ ఇస్తారు అనేది.
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు నేచురల్ స్టార్ నాని సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఈ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


