|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ- డైరెక్టర్ ఔట్- సుందర్ సి ఎగ్జిట్‌పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-కార‌ణం ఏంటంటే?

Published: 15-11-2025, 6:13 AM
రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ- డైరెక్టర్ ఔట్- సుందర్ సి ఎగ్జిట్‌పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-కార‌ణం ఏంటంటే?

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రానున్న ‘తలైవర్ 173’ సినిమా నుండి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నారు. ఆయన ఎగ్జిట్‌పై కమల్ హాసన్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Key Points

1

రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి 'తలైవర్ 173'లో నటించనున్నట్లు ప్రకటించారు.

2

ఈ చిత్రానికి సుందర్ సి దర్శకుడిగా తొలుత ప్రకటించినప్పటికీ, ఆయన తప్పుకున్నారు.

4

సుందర్ సి ఎగ్జిట్‌పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది.

రజనీకాంత్-కమల్ హాసన్ మూవీ ప్రకటన

కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొద్ది రోజులకే సుందర్ తప్పుకున్నారు. దీనిపై తాజాగా కమల్ హాసన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

సుందర్ సి ఎందుకు తప్పుకున్నారు?

ఈ నెల ప్రారంభంలో కమల్ హాసన్, రజినీకాంంత్ కలిసి ‘తలైవర్ 173’ అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఒక సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 2027 పొంగల్ నాటికి విడుదల కానుంది. సుందర్ సి దీనికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే సుందర్ సి.. ఊహించని, తప్పించుకోలేని పరిస్థితుల కారణంగా సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

సుందర్ సి ఎగ్జిట్‌పై కమల్ హాసన్ స్పందన

కూలీ విడుదల కావడానికి ముందే రజనీకాంంత్, కమల్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారనే సంకేతాలు కనిపించాయి. కమల్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో ‘తగ్ లైఫ్’ చిత్రంలో కనిపించారు. రజనీకాంత్ ఏమో కూలీ మూవీతో హిట్ కొట్టారు.

సుందర్ సి వైదొలగడంపై కమల్ హాసన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు భవిష్యత్తు, కొత్త దర్శకుడు ఎవరు అనే విషయాలపై మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.