
రజినీకాంత్ తో సునీల్ కలిసి నటించిన ‘కథానాయకుడు’ సినిమా సెట్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. రజినీకాంత్ పవన్ కళ్యాణ్ గురించి సునీల్ కి ఏం చెప్పారో తెలుసుకుందాం.
Key Points
రజినీకాంత్ పవన్ కళ్యాణ్ ని 'పొలిటికల్ తూఫాన్' అని అభివర్ణించారు.
సునీల్, రజినీకాంత్ తో కలిసి 'కథానాయకుడు' సినిమాలో నటించారు.
రజినీకాంత్ పవన్ కళ్యాణ్ ను తెలుగు సినీ రంగంలో భవిష్యత్ సూపర్ స్టార్ గా అంచనా వేశారు.
'జల్సా' సినిమా యాడ్ చూసి రజినీకాంత్ పవన్ గురించి ఆ అభిప్రాయం వ్యక్తం చేశారని సునీల్ తెలిపారు.
రజినీకాంత్ – పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ వ్యక్తులతో కూడా అంతే మంచి అనుబంధం ఉంది. ఇటీవలే రజినీకాంత్ సినీ పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ చేయగా రజినీకాంత్ పవన్ ని పొలిటికల్ తూఫాన్ అంటూ అభివర్ణిస్తూ ధన్యవాదాలు తెలిపారు. దాంతో రజినీకాంత్(Rajinikanth) ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ క్రమంలో సునీల్ గతంలో రజినీకాంత్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు అని చెప్పిన వీడియో వైరల్ గా మారింది. సునీల్ రజినీకాంత్ తో కలిసి కథానాయకుడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.
సునీల్ గుర్తుచేసుకున్న ఆ సంఘటన
సునీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజినీకాంత్ గారితో కథానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు జల్సా పేపర్ యాడ్ వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ నా ఫ్రెండ్ కదా. నేను ఆ పేపర్ యాడ్ రజినీకాంత్ కు చూపించి ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ నా ఫ్రెండ్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడు అని చెప్పాను. ఆయన హా త్రివిక్రమ్ తెలుసు అన్నారు. ఆ యాడ్ లో పవన్ కళ్యాణ్ గారి స్టిల్ చూసి ఈయనే తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్, ఓ రేంజ్ కి వెళ్తారు అన్నారు. ఆయనకు అలా ఎలా తెలుసు అని నేను అనుకునేవాడిని అని తెలిపాడు.
రజినీకాంత్ పవన్ కళ్యాణ్ పై అభిప్రాయం
కథానాయకుడు, జల్సా రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకేసారి షూట్ అయి రెండూ 2008 లోనే రిలీజయ్యాయి. కథానాయకుడు యావరేజ్ గా మిగలగా, జల్సా సూపర్ హిట్ అయింది.
సునీల్ గుర్తుచేసుకున్న ఈ సంఘటన రజినీకాంత్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు రజినీకాంత్ వ్యక్తం చేసిన అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.


