
📌 Key Points
- తలైవార్ 173లో రజినీకాంత్ మొట్టమొదటిసారి డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.
- కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
- ‘ఎస్’ గుర్తు స్టెతస్కోప్‌తో రజినీకాంత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- ‘₹5 డాక్టర్’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ మొదలైంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు పండగే! ‘తలైవార్ 173’ నుండి ఊహించని అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ కెరీర్‌లో మొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్నారు. వైరల్ అవుతున్న ఆ ఫోటోలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
తలైవార్ కొత్త అవతార్: డాక్టర్ రజినీకాంత్!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసర్ నిర్మాణంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవార్ 173’. ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ మొట్టమొదటిసారి డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి ఓ వార్త వైరల్ అవుతున్నది. ఈ మేరకు ‘ఆర్కేఎఫ్ఐ కార్యాలయంలో ఫోటోషూట్ జరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జి. వెంకట్ రామ్ నిర్వహించిన ఈ ఫోటోషూట్‌లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఆయన మెడలో ‘ఎస్’ గుర్తు ఉన్న స్టెతస్కోప్‌ను ధరించి ఫోటోలు దిగారు. ఇవి చూడటానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే.. ‘చంద్రముఖి’ వంటి కొన్ని సినిమాల్లో ఆయనను డాక్టర్‌గా ప్రస్తావించినప్పటికీ.. తలైవార్‌లో పూర్తిస్థాయి డాక్టర్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి అని టాక్. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ చిత్రం అయినప్పటికీ.. చెన్నైలో బాగా ప్రాచుర్యం పొందిన ‘₹5 డాక్టర్’ స్ఫూర్తిదాయక అంశాలను కలిగి ఉంటుంది. అలాగే, చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సను అందించి ప్రజల నుండి అపారమైన ప్రశంసలు పొందిన పలువురు వైద్యుల జీవితాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తుండగా.. అలాంటి ఓ డాక్టర్ పాత్రను రజినీకాంత్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈ సినిమా డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
వైరల్ అవుతున్న ఫోటోషూట్ లీక్స్!
కమల్ హాసన్-రజినీకాంత్ కాంబో మ్యాజిక్!
రజినీకాంత్ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి కాబోతుందని స్పష్టమవుతోంది. కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


