|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కన్నప్ప’ సినిమా చూసిన రజినీకాంత్.. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని ట్వీట్

Published: 16-06-2025, 8:39 AM
‘కన్నప్ప’ సినిమా చూసిన రజినీకాంత్.. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని ట్వీట్

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాకు రజినీకాంత్ గారు ప్రశంసలు తెలిపారు. సినిమా చూసిన తర్వాత ఆయన ట్వీట్ చేస్తూ, ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

రజినీకాంత్ గారు 'కన్నప్ప' సినిమా చూశారు

2

సినిమా చూసిన తర్వాత రజినీకాంత్ గారు మంచు విష్ణు గారికి టైట్ హగ్ ఇచ్చారు

4

జూన్ 27న విడుదల కాబోతున్న 'కన్నప్ప' సినిమాపై అంచనాలు పెరిగాయి

రజినీకాంత్ కన్నప్ప సినిమా ప్రశంసలు

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇంతకు ముందు సినిమాపై మీమ్స్ వచ్చినా.. ట్రైలర్ వచ్చాక మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ పెరిగింది. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉండటం, మూవీ గ్రాండ్‌గా కనిపించడం ప్లస్ అవుతున్నట్లే కనిపిస్తుంది. మొత్తానికి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాపై హైప్ మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నాడు విష్ణు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో రజినీకాంత్‌ను కూడా ఇందులో భాగం చేశాడు. తాజాగా ఆయనకు కన్నప్ప చిత్రాన్ని చూపించామని.. ఆయనకు బాగా నచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశాడు.

సినిమా చూశాక రజినీకాంత్ అంకుల్ టైట్ హగ్ ఇచ్చాడని.. తనకు కన్నప్ప నచ్చిందని చెప్పాడని తెలిపాడు మంచు విష్ణు. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పిన హీరో.. జూన్ 27 కోసం వెయిట్ చేయలేకపోతున్నానని.. వెండి తెరపై శివుడి మ్యాజిక్ ఫీల్ అయ్యేందుకు ఈగర్‌గా ఉందని చెప్పాడు. ఇక ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కానీ కొందరు మాత్రం రజినీకాంత్‌ను విష్ణు అంకుల్ అని పిలవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్ డ్యామేజ్‌గా వర్ణిస్తున్నారు.

మంచు విష్ణు ట్వీట్ వైరల్

సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి

మొత్తంగా, రజినీకాంత్ గారి ప్రశంసలతో ‘కన్నప్ప’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జూన్ 27 తేదీన విడుదల కానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.