
📌 Key Points
- రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో జైలర్ 2లో భారీ కాస్టింగ్! సౌత్ మార్కెట్ షేక్!
- షారుఖ్ ఖాన్ పోలీస్ పాత్రలో మెరవనున్నాడు! రజనీకాంత్‌తో కలిసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా?
- జైలర్ 2 కోసం రజనీకాంత్, నెల్సన్ పక్కా మాస్టర్ ప్లాన్! నార్త్ మార్కెట్ టార్గెట్!
- ఈ ఏడాది ద్వితీయార్థంలో జైలర్ 2 విడుదల! రజనీకాంత్ రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 తో వస్తున్నాడు! ఈ సారి షారుఖ్ ఖాన్ కూడా జత కలవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం!
జైలర్ 2లో షారుఖ్ ఖాన్?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇప్పుడు `జైలర్ 2` రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. గతంలో వచ్చిన `జైలర్` మూవీకిది సీక్వెల్. ఆ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసింది. తమిళంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మరే తమిళ పాన్ ఇండియా మూవీ కూడా దాన్ని టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు రజనీకాంత్ తన రికార్డులను తానే బ్రేక్ చేయబోతున్నారు.
ప్రస్తుతం `జైలర్ 2` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భారీ కాస్టింగ్ నటిస్తోంది. రజనీకాంత్‌తోపాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. మొదటి భాగంలోనూ వీరిద్దరున్నారు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. తెలుగు నుంచి ఓ హీరో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. బాలకృష్ణ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్స్ తో రజనీకాంత్ ప్లాన్
ఈ క్రమంలో ఇందులో మరో సూపర్ స్టార్ కనిపిస్తారని తెలుస్తోంది. పాన్ ఇండియా హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనే షారూఖ్ ఖాన్. గతంలోనూ ఈ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలిసింది. రణ్‌వీర్ సింగ్ కనిపిస్తారని అన్నారు. కానీ దీనిపై కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం షారూఖ్ ఖాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నారట. పోలీస్ పాత్రలో షారూఖ్ ఖాన్ కనిపిస్తారని సమాచారం.
మొదటి భాగంలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో జైలర్‌గా కనిపిస్తారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎక్కువగా చూపిస్తారని, ఆ ఎపిసోడ్‌లో షారూఖ్ ఖాన్ కనిపిస్తారని సమాచారం. ఆ సమయంలో రజనీకాంత్‌కి, షారూఖ్ పాత్రకి మంచి స్నేహం ఉంటుందని, క్లిష్ట సమయంలో మళ్లీ ఆయన రజనీకాంత్ కి హెల్ప్ చేయడానికి వస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది చూడాలి.
బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ!
ఇదే నిజమైతే ఇండియన్ సినిమా షేక్ కాబోతుందని చెప్పొచ్చు. రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్ కుమార్ ఉండటంతో సౌత్ మార్కెట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు షారూఖ్ ఖాన్ వస్తే నార్త్ మార్కెట్ సెట్ అవుతుంది. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీసు షేక్ అవుతుందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఇటు రజనీ, అటు నెల్సన్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు.
జైలర్ 2 తో రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఎంట్రీ సినిమాకు మరింత హైప్ తెస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


