|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్నప్పుడు విన్న కథతో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ తీశా:

Published: 16-11-2025, 1:24 AM
చిన్నప్పుడు విన్న కథతో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ తీశా:

దర్శకుడు సాయిలు కంపాటి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా కథను చిన్నప్పుడు విన్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా రాసుకున్నానని తెలిపారు. ఇది పరువు హత్యకు దగ్గరగా ఉండే ప్రేమ కథ అని, అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతుందని వెల్లడించారు.

Key Points

1

డైరెక్టర్ సాయిలు కంపాటి చిన్నప్పుడు విన్న 2004 వాస్తవ ఘటనతో కథ రాశారు.

2

ఇది పరువు హత్యకు సంబంధించినది కాకున్నా, అలాంటిదే అని దర్శకుడు పేర్కొన్నారు.

4

వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించగా, ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ భాగస్వామిగా ఉంది.

సినిమా కథా నేపథ్యం, సాయిలు కంపాటి మాటలు

‘‘2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు… కానీ, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది? అనేది మాత్రం తెరపైనే చూడాలి’’ అని డైరెక్టర్‌ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్, మాన్‌సూన్‌ టేల్స్‌ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు.

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ తారాగణం, నిర్మాణం

ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కం΄ాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్స్‌ వేణు ఊడుగుల, శ్రీకాంత్‌ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్‌ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు.

విడుదల తేదీ, దర్శకుడి ఆత్మవిశ్వాసం

ఈ సినిమా ఔట్‌పుట్‌ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంది΄ాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్‌ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ్ర΄ాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

దర్శకుడు సాయిలు కంపాటి తమ సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పెద్ద సినిమాలు ఉన్నా తమకు ఒత్తిడి లేదని తెలిపారు. వేణు ఊడుగుల నిర్మాణంలో తదుపరి ప్రాజెక్ట్ త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.